ఆంధ్రప్రదేశ్‌

సర్వీసు క్రమబద్ధీకరణను పరిశీలిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల్లో ఎపి రెసిడెన్షియల్, గిరిజన పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. శాసనమండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో గుమ్మిడి సంధ్యారాణి తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, ఈ పాఠశాలల్లో టిటిసి పూర్తి చేసిన వారు 646, బిఇడి పూర్తి చేసిన వారు 864 మంది కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నారన్నారు. వీరికి ప్రస్తుతం 5500 రూపాయలు వేతనంగా ఇస్తున్నామని, ఔట్‌సోర్సింగ్ వారికి సమానంగా తొలుత 12 వేల రూపాయలకు వేతనాన్ని పెంచుతామన్నారు. వేతనాల హెచ్చింపుకోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైందని, ఈ ఉపసంఘం సిఫార్సులను అమలు చేస్తామని చెప్పారు. అలాగే సభ్యులు బాలసుబ్రహ్మణ్యం తదితరులు సూచించిన ప్రకారం టీచర్లుగా పనిచేస్తూ, సస్పెన్సన్, డిస్మిస్‌కు గురైన వారి కేసులను పునర్విచారిస్తామన్నారు. గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రావెల తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిధులను సక్రమంగా వ్యయం చేస్తున్నామని పంచాయితీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు.
ఆర్. రెడ్డపరెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకాన్ని ఫకడ్బందీగా అమలు చేస్తున్నామని వివరించారు.
రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బందిగా ఉన్న మండలాల్లో ప్రజలకు తాగునీటిని అందించేందుకు ఎఐఐబి కింద 4500 కోట్ల రూపాయలు కావాలని కేంద్రాన్ని అడిగామని బి. నరేష్‌కుమార్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అయ్యన్నపాత్రుడు సమాధానంగా చెప్పారు. కేవలం చిత్తూరు జిల్లాలోనే 1130 కోట్ల రూపాయల విలువైన పనులను ప్రతిపాదించామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని పురపాలక మంత్రి నారాయణ తెలిపారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, ఎపిపిఎస్‌సికి ఖాళీల వివరాలను పంపించి, భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు.