ఆంధ్రప్రదేశ్‌

జనవరి నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ జీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల: జనవరి నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుందని ఏపీఎస్‌ఆర్‌టీసీ ఎండి కృష్ణబాబు తెలిపారు. కడప జిల్లా పులివెందులలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఆర్టీసీకి మంచి పేరు ఉందన్నారు. ఒక లీటరు డీజల్‌పై 5.2 కిలోమీటర్ల మైలేజి ఇస్తున్నామన్నారు. ఈసారి పది పాయింట్లు తగ్గిందని అన్నారు. అందువల్ల డ్రైవర్లు ఆ పది పాయింట్లు పెంచే దిశగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో 126 ఆర్టీసీ డిపోలు ఉన్నాయని, అందులో పులివెందుల డిపోను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్నారు. ఉద్యోగులకు సంస్థ జీతాల రూపంలో రూ. 3,300 కోట్లు చెల్లిస్తోందన్నారు. ప్రభుత్వం జీతాలు ఇవ్వడం ద్వారా ఆర్టీసీకి రూ.2వేల కోట్లు మిగుతాయన్నారు. ఈ డబ్బుతో ఆర్టీసీ ఉద్యోగులు బకాయిలు ఉన్న, అరియర్స్, పీఎఫ్, పెన్షన్ బకాయిలు పూర్తిగా అందజేస్తామన్నారు.