ఆంధ్రప్రదేశ్‌

కల్తీ నియంత్రణకు కొత్త చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 18: వ్యవసాయ సీజన్ ప్రారంభంలో కల్తీలకు రైతు మోసపోకుండా ప్రభుత్వపరంగా తగిన గ్యారంటీ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నకిలీ, కల్తీ ఎరువులు, పురుగు మందులతో జరుగుతున్న మోసాల నియంత్రణకు ఏపీ బయోప్రొడక్ట్స్ రెగ్యులేటరీ యాక్ట్‌ను తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకు తగిన పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారు. సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ మిషన్‌పై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 45,20,616 మంది కుటుంబాలకు రూ. 5185.35 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 15 వరకు కౌలు రైతులకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. దేవాలయాలు, సొసైటీల పేరుతో సాగు చేసుకుంటున్న రైతులకూ భరోసా వర్తింప చేయాలని సమావేశంలో నిర్ణయించారు. రైతు భరోసాతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని వ్యవసాయ మంత్రి కన్నబాబు తెలిపారు. రెండో విడత కల్లా మరింత మందికి లబ్ధి చేకూరుతుందని రెవెన్యూ మంత్రి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. రికార్డుల పరంగా ఇతరత్రా సమస్యలు ఏవైనా ఉంటే ఎప్పటి కప్పుడు పరిష్కరించుకునే వెసులుబాటు కల్పించాలని సీఎం ఆదేశించారు. వచ్చే మే నెల నాటికి మరింత మందికి ప్రయోజనం చేకూర్చాలన్నారు. రైతు భరోసాను విజయవంతంగా నిర్వహించటం పట్ల అధికారులు, వ్యవసాయ మిషన్ పాలకవర్గాన్ని అభినందించారు. గ్రామ సచివాలయాల సమీపంలోనే ఎరువుల దుకాణాలు, వర్క్‌షాప్‌ల ఏర్పాటుపై సమీక్ష జరిపారు. జనవరి ఒకటి నుంచి
అమల్లోకి తీసుకురావాలని నిర్దేశించారు. ఇందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రతి వస్తువుకూ ప్రభుత్వ పరంగా గ్యారంటీ ఇవ్వాలని స్పష్టం చేశారు. వర్క్‌షాపులో రైతులకు ఏయే అంశాలకు శిక్షణ ఇవ్వాలనే దానిపై కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. భూసార పరీక్షలను కూడా వర్క్‌షాపులోనే నిర్వహించాలని ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ సచివాలయాల్లో ఉన్న వ్యవసాయ సహాయకుల సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. సచివాలయాల్లో ఏర్పాటు చేసే వర్క్‌షాపులలో కూడా వారి సేవలు పొందాలన్నారు. బయో పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ పేరిట జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ఏపీ బయో ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ యాక్ట్ తీసుకురావాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మార్కెట్ ఇంటెలిజెన్స్‌పై ఆరా తీశారు. గోదాముల నిర్మాణంపై మండలాలు, నియోజకవర్గాల వారీగా మ్యాపింగ్ చేయాలని సూచించారు. వేరుసెనగ, పత్తి, మొక్కజొన్న ధరలపై సమావేశంలో సమీక్షించారు. రైతులు నష్టపోకుండా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం తరుపు నుంచి వెంటనే కేంద్రాలను ప్రారంభించాలని తీర్మానించారు. వేరుసెనగ, మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు తెరవాలన్నారు. కనీస మద్దతు ధర లేని చిరుధాన్యాలను సాగు చేస్తున్న రుతైలను ఆదుకుంటామని ప్రకటించారు. సాగుకు అవుతున్న ఖర్చును పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు ప్రభుత్వమే ధరలు ప్రకటిస్తుందని వెల్లడించారు. దీనిపై పూర్తి స్థాయిలో ఆధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. టమోటా రైతులను ఆదుకునేందుకు చొరవ చూపిన అధికారులను ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా రైతులను ఆదుకున్నామని అధికారులు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు మార్కెటింగ్ శాఖ చేసిన కొనుగోళ్లు కారణంగా రైతులు నష్టపోకుండా వెసులుబాటు కల్పించామని వివరించారు. చీనీ రైతులకు మంచి ధరలు లభించేలా అనుసరించాల్సిన మార్కెటింగ్ వ్యూహాలపై సీఎం సమీక్షించారు. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల నియామకాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాలకవర్గాల ఏర్పాటులో ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. మార్కెట్ యార్డులలో కనీస సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. మార్కెట్ యార్డులను నాడు- నేడు తరహాలో అభివృద్ధి చేయాలన్నారు. రైతు బజార్లను బలోపేతం చేయాలని నిర్ణయించారు. పంటలకు వన్యప్రాణుల నుంచి రక్షణ కల్పించటంపై సమగ్ర నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
*చిత్రం... తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సోమవారం వ్యవసాయ మిషన్‌పై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి