ఆంధ్రప్రదేశ్‌

ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 18: ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమ తవ్వకాలు, రవాణా, నిల్వలు, అధిక ధరలకు విక్రయాలపై నిరంతర నిఘా వహించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, టాస్క్ఫోర్స్ చీఫ్ సురేంద్రబాబు, ఇతర ఉన్నతాధికారులతో కలసి ఫిర్యాదుల స్వీకరణకు (14500) టోల్‌ఫ్రీ నంబర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తరువాత ఆ నెంబర్‌కు నేరుగా కాల్‌చేసి ఉద్యోగులతో మాట్లాడారు. ఫిర్యాదులు స్వీకరిస్తున్న తీరు, వాటిని ఎవరికి నివేదిస్తున్నారనే అంశాలను కాల్ సెంటర్ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులు స్వీకరించే సమయంలో తీసుకోవాల్సిన సమాచారంపై కొన్ని సూచనలు చేశారు. ఇసుక అక్రమాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని టాస్క్ఫోర్స్
చీఫ్ సురేంద్రబాబుకు స్పష్టం చేశారు. కాల్ సెంటర్ ద్వారా వచ్చే సమాచారాన్ని ఇసుక అక్రమాల నిరోధానికి వినియోగించాలని, ఎవరు తప్పు చేసినా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విజయవంతంగా వారోత్సవాలు
వరదలు తగ్గుముఖం పట్టటంతో ఇసుక కొరత ఇప్పుడిప్పుడే తీరుతోంది. రోజుకు లక్ష నుంచి రెండు లక్షల టన్నులు అందుబాటులోకి తెచ్చే వీలు కలిగింది. ఇందుకు తగిన రవాణా వాహనాలను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. గత శనివారం ఒక్క రోజులోనే 2లక్షల 3వేల 387 టన్నుల ఇసుకను అందుబాటులోకి తేగా, ఇందులో కేవలం 50వేల 86 టన్నులు మాత్రమే బుక్ అయినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం నాటికి సగం డిమాండ్ తగ్గటంతో రానున్న రోజుల్లో సరాసరి 40 వేల టన్నుల వరకు రోజువారీ డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈనెల 14 నుంచి ప్రారంభమైన వారోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
*చిత్రం... ఇసుక అక్రమాలపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నెంబర్ ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి జగన్