ఆంధ్రప్రదేశ్‌

ఐసీడీఎస్ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 18: ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ప్రజా పోరాటంతో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎదుర్కొంటామని అఖిల భారత అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ఏకే సింధు తెలిపారు. ఐసీడీఎస్ పరిరక్షణే ధ్యేయంగా ప్రస్తుతం జరుగుతున్న జాతీయ మహాసభల్లో కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న సమాఖ్య జాతీయ మహాసభల్లో పాల్గొంటున్న ఆమె సోమవారం విలేఖర్లతో మాట్లాడారు. గత మూడేళ్లుగా దేశవ్యాప్తంగా సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాలపై మహాసభల్లో సమీక్ష నిర్వహించామన్నారు. ఐసీడీఎస్‌కు నిధుల కుదింపు, ఐసీడీఎస్ కేంద్రాలకు సరఫరాచేసే పౌష్టికాహారం గత ఆరు నెలలుగా నిలిపివేయడం ఇవన్నీ కేంద్రం కుట్రలేనన్నారు. సరైన పౌష్టికాహారం లేకపోవడం వల్ల పిల్లలు, ముఖ్యంగా మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలోన్లూ ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. ఐసీడీఎస్‌కు సంబంధించిన రికార్డులను సైతం తారుమారుచేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. కాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దుచేసి, గవర్నర్ పాలన ద్వారా ఐసీడీఎస్ కేంద్రాలను పంచాయతీలకు అప్పగించేలా చర్యలుచేపడుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇందుకు మినహాయింపులు లేకుండా పోయాయని విలేఖర్ల సమావేశంలో పాల్గొన్న సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ తెలిపారు. గతంలో చంద్రబాబు అవలంబించిన విధానాలనే ప్రస్తుత జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. గత రెండు నెలలుగా అంగన్‌వాడీలకు గౌరవ వేతనం ఇవ్వడంలేదన్నారు. అలాగే అంగన్‌వాడీ భవనాలకు అద్దె బకాయిలను చెల్లించడంలేదన్నారు. రవాణా ఛార్జీలు చెల్లించడంలేదని, గుడ్లు, పాలు సరఫరా తగ్గించేశారన్నారు. రాష్ట్రంలో ఐసీడీఎస్ కేంద్రాలను అక్షయపాత్ర అనే సంస్థకు అప్పగించే కుట్రలకు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపిందన్నారు. అంగన్‌వాడీలపై అదనపు పనిభారాన్ని మోపుతున్నారన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులతో వేధింపులకు గురిచేస్తున్నారన్నారు.