ఆంధ్రప్రదేశ్‌

ఇదేనా భరోసా ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), నవంబర్ 18: ఒక వైపు మొక్కజొన్న ధర, మరో వైపు వేరుశనగ ధర అమాంతం తగ్గించి దళారులు రైతులను నిండా ముంచుతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 5 వేల కోట్ల రూపాయల ధరల స్థీరీకరణ నిధి ఏమయిందని సోమవారం ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ప్రశ్నించారు. మొక్కజొన్న క్వింటా ధర రూ.2100 నుండి రూ.1500కు పడిపోయేదాకా రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర పోయిందన్నారు. దళారుల ఇష్టారాజ్యానికి రైతులను బలిచేస్తోందన్నారు. వీళ్ల చేతకానితనంతో దళారులు స్వైర విహారం చేస్తున్నారన్నారు. మార్కెట్లో ఎక్కువ రేటు ఉన్నందుకే రైతులు మార్కెట్ యార్డులకు రావడం లేదనడం దివాళాకోరుతనం అవుతుందన్నారు. తక్షణం తగిన సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళారుల బారి నుండి రైతాంగాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. అలాగే వేరుశనగ పంట దిగుబడి వచ్చి రైతులు అమ్ముకోవడానికి సిద్దపడగానే మార్కెట్‌లో క్వింటా ధర రూ.8200 నుండి రూ.4000కు అమాంతంగా పడిపోయిందన్నారు.