ఆంధ్రప్రదేశ్‌

భవన నిర్మాణ కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 18: వైఎస్ జగన్ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ ఇసుక కొరత కారణంగా 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడ్డారని, వారికి నష్టపరిహారం ఇచ్చి తక్షణం ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. విజయవాడ బృందావన్ కాలనీలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటసాయి ఆధ్వర్యంలో అధికార ప్రతినిధి కార్యాలయం, బీజేపీ ధార్మిక సెల్ రాష్ట్ర అధ్యక్షులు గోగులూరి శ్రీ కృష్ణ చైతన్య శర్మ ఆధ్వర్యంలో ధార్మిక సెల్ కార్యాలయాలను అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక మాఫియా చంద్రబాబు హయాంలో ప్రారంభమైందన్నారు. జగన్ ప్రభుత్వం దీనిని కొనసాగించిందని ఆరోపించారు. అధికారంలోకి రాగానే జగన్ కృత్రిమ ఇసుక కొరత సృష్టించారని, రెండు ప్రభుత్వాలు ఇసుకను దోపిడీ చేశాయని అన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని కన్నా చెప్పారు. 2008లో వైఎస్ హయాంలో కూడా తెలుగు భాషకు ప్రాచీన హోదా ఉండాలని పోరాడి సాధించామన్నారు. ఇంగ్లీషు మీడియంకు బీజేపీ వ్యతిరేకం కాదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్బంధ ఆంగ్ల విద్యా బోధన ఉండకూడదని అన్నారు. తెలుగు మీడియం పాఠశాలలను తొలగించకుండా ఇంగ్లీషు మీడియం తరగతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏపీలో ధార్మిక పరిషత్ నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించిన తీరు అభినందనీయమన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు బీజేపీ అనుబంధ సంఘాలు, నాయకులు, కార్యకర్తలు ఎప్పుడూ ముందువరుసలో ఉంటారన్నారు. కార్యాలయాలు ఏర్పాటు చేసినందుకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటసాయి, బీజేపీ ధార్మిక సెల్ రాష్ట్ర అధ్యక్షులు గోగులూరి శ్రీ కృష్ణ చైతన్య శర్మలను కన్నా అభినందించారు.