ఆంధ్రప్రదేశ్‌

తెలుగు కూడా సమాంతరంగా ఉండాలి: నక్కా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 18: పేద విద్యార్థులు ఆంగ్ల మాధ్యమం అభ్యసించడాన్ని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోందని దుష్ప్రచారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందే విద్యా వ్యవస్థలో చేయాల్సిన మార్పులు, చేపట్టాల్సిన సంస్కరణలపై దృష్టి పెట్టాలని, ఇవేమీ లేకుండా తమపై దుష్ప్రచారం చేయడం తగదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆక్షేపించారు. సోమవారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగ్ల మాధ్యమంతో పాటు, తెలుగు మాధ్యమం కూడా సమాంతరంగా ఉండాలన్నారు. వెంకయ్య నాయుడు, పవన్‌కళ్యాణ్‌ల పిల్లలు ఎక్కడ చదివారని ప్రశ్నిస్తున్న జగన్మోహన్‌రెడ్డి, తన పిల్లలు లండన్‌లో చదువుతున్న విషయాన్ని గుర్తించాలన్నారు. జీవో-81 ద్వారా ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టడంపై అమితాసక్తి చూపుతున్న జగన్ సర్కారు, ముందుగా ఆంగ్ల మాధ్యమాన్ని అర్థం చేసుకునే స్థాయిలో విద్యార్థులు ఉన్నారా, వారికి అర్థమయ్యే రీతిలో సులభతరంగా బోధించేలా ఉపాధ్యాయుల బోధనాస్థాయి ఉందో లేదో ఆలోచించాలని సూచించారు. తెలుగుదేశం ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నాడు బట్టలు చించుకుని, నేడు నోరెత్తలేని స్థితిలో యర్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఉన్నారని విమర్శించారు. నాడు తెలుగుదేశం నిర్ణయాన్ని వ్యతిరేకించిన భాషా సంఘాలు, ప్రజాసంఘాలు నేడు భయంతోనే స్పందించడం లేదన్నారు.