ఆంధ్రప్రదేశ్‌

మంత్రుల మాటల్లో కొరవడిన హుందాతనం: ఆనంద సూర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 18: ఎన్నికల్లో ప్రజాభిప్రాయం మేరకు గెలిచి పదవులు అనుభవిస్తున్న మంత్రులు సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలనే ఆలోచన లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారి వ్యాఖ్యల్లో హుందాతనం లోపిస్తోందని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య పేర్కొన్నారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుండి సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధి విషయంలో ఆది నుండి వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. తిరుమలను సందర్శించే అన్యమతస్తులు డిక్లరేషన్ ఇచ్చి అలయాల్లోకి వెళ్లాలనే నిబంధన ఉన్నా ముఖ్యమంత్రి జగన్ పాటించలేదనే విమర్శకి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి కొడాలి నాని స్పందించిన విధానం చూసి సభ్యసమాజం తలదించుకుంటోందన్నారు. హుందాగా నడుచుకోవాల్సిన మంత్రులు సహనం కోల్పోయి మాట తూలడం సిగ్గుచేటన్నారు.