ఆంధ్రప్రదేశ్‌

రాత్రి పదికే మద్యం బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 19: దశలవారీ మద్య నిషేధంలో భాగంగా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బార్ల సంఖ్యను 40 శాతం తగ్గించాలని నిర్ణయించింది. ఇప్పటికే బెల్ట్‌షాపుల నియంత్రణతో పాటు 20 శాతం దుకాణాలను తగ్గించి నేరుగా ప్రభుత్వ నిర్వహణలో మద్యం విక్రయాలు జరుపుతోంది. తాజాగా బార్ల సంఖ్య కుదింపుతో పాటు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే మద్యం సరఫరా చేయాలని నిర్దేశించింది. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మద్య నియంత్రణపై మంత్రులు, సంబంధిత ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మద్య నియంత్రణపై అమల్లో ఉన్న చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై అధికారులతో చర్చించారు. బార్ల సంఖ్యను కుదించే విషయమై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. రాష్ట్రంలో 38 స్టార్ హోటళ్లు, నాలుగు పబ్‌లు సహా మొత్తం 839 బార్లకు లైసెన్స్‌లు ఉన్నట్లు అధికారులు వివరించారు. ఆతిథ్య రంగానికి సంబంధించి స్టార్ హోటళ్లు, పబ్‌లను మినహాయిస్తే 797 బార్లు ఉంటాయని సీఎం దృష్టికి తెచ్చారు. వీటలో సగానికి పైగా తగ్గించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనిపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం నూతన విధానంలో భాగంగా ఇప్పటికే 20 శాతం దుకాణాలను తగ్గించామని, 4380కు గాను 3500 షాపులకు కుదించామని వివరించారు. అయితే మద్య నియంత్రణ కార్యక్రమాన్ని దశల వారీగా చేపడుతున్నందున బార్ల సంఖ్యను కూడా తగ్గిద్దామని ముఖ్యమంత్రి సూచించారు. దీనిపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. చివరకు 797 బార్లకు గాను 40 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. వీటికి కొత్తగా లైసెన్స్‌లు మంజూరు చేయటంతో పాటు లాటరీ పద్ధతిలో బార్లను కేటాయించే విషయమై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. మద్యం ముట్టుకుంటే షాక్ కొడుతుందనే భావన రావాలని అప్పుడే చాలామంది దూరమవుతారని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు దరఖాస్తు, లైసెన్స్ ఫీజులు కూడా పెంచాలని అధికారులను ఆదేశించారు. అంతిమంగా మద్య నిషేధం దిశగా అడుగులు వేయాలని వౌలిక లక్ష్యాన్ని
దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
బార్ల సంఖ్యను కుదించటంతో పాటు మద్యం సరఫరా సమయాన్ని కూడా కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో జరిగిన సమీక్షా సమావేశాల్లో ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం సరఫరాను, రెస్టారెంట్లలో ఆహార పదార్థాలను అనుమతిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. స్టార్ హోటళ్లలో ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం విక్రయానికి అనుమతి ఉంటుందని తెలిపారు. బార్లలో మద్యం ధరలను పెంచే విషయం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది.
నాటుసారా తయారీ, మద్యం స్మగ్లింగ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని, ఆరు నెలలు జైలుశిక్ష విధించేలా చట్టంలో సవరణలు తీసుకురావాలని స్పష్టం చేశారు. బార్ల యజమానులు నియమాలను ఉల్లంఘిస్తే లైసెన్స్ ఫీజుకు ఐదు రెట్ల జరిమానా విధించాలని ఆదేశించారు. వచ్చే శాసనసభ సమావేశాల్లోనే ఇందుకు తగిన బిల్లును ప్రవేశపెట్టాలని అధికారులకు సూచించారు. ఇసుక అక్రమాలకు పాల్పడితే రెండేళ్ల జైలు, రూ. 2లక్షల జరిమానా విధించే నిర్ణయంపై కూడా బిల్లు తీసుకు రావాలన్నారు. ఇందుకు సంబంధించిన చట్ట సవరణలు కూడా సమావేశాల్లోనే జరగాలన్నారు. వీటితో పాటు ఇసుక, మద్యం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మద్యం దుకాణాల వద్ద సీసీ కెమేరాలు అమర్చాలని స్పష్టం చేశారు.

*చిత్రం... అధికారులు, మంత్రులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి