ఆంధ్రప్రదేశ్‌

నేటి నుంచి ఇంటింటి సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటింటి సర్వే జరగబోతున్నది. ముఖ్యంగా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు ఇంటింటికి వెళ్లి పరిశీలన చేసేందుకు ఉద్దేశించిన ఈ సర్వే ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు నెల రోజులపాటు జరగుతుంది. వైఎస్సార్ నవశకం పేరిట గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయనున్నారు. ప్రధానంగా నవరత్నాల పథకాలు పేదలందరికీ
అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. వీటిలో నూతనంగా రేషన్‌బియ్యం అందజేసేందుకు ఒక కార్డు, సామాజిక పింఛన్లు పొందేందుకు మరో కార్డు, ఐదు లక్షలలోపు ఆదాయం కల్గిన వారందరికీ ఆరోగ్యశ్రీకార్డులు అందజేయనున్నారు. ఇక కుటుంబంలో ఎవరైనా ఒక కారు ఉన్నా ఆరోగ్యశ్రీకి అర్హులే. వీటితోపాటు జగనన్న విద్యా దీవెన ద్వారా అమ్మఒడి, ఇతర స్కాలర్‌షిప్‌లు, నైపుణ్య కార్పొరేషన్ ద్వారా శిక్షణ పోటీ పరీక్షలకు శిక్షణకై హాజరయ్యేలా మరో కార్డును అందిస్తారు. జగనన్న వసతి దీవెన ద్వారా ప్రభుత్వ వసతి గృహాల్లో వసతి పొందుతున్న విద్యార్థులందరికీ మరో కార్డు అందజేస్తారు. వీటితోపాటు ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు అర్హులైన జాబితాలను కూడా ఈ సర్వేలో గుర్తిస్తారు. ఈ సర్వే నిర్వహణ కోసం ఇప్పటికే వలంటీర్లందరికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం విద్య, వైద్య సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం కేవలం తెల్లరేషన్‌కార్డులనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అసలు ఎన్నడూ బియ్యం తీసుకోనివారికి కూడా తెల్లరేషన్ కార్డులు ఉండగా వీటిల్లో కొన్ని డీలర్‌లు, దళారుల చేతుల్లోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే సర్వే పేరిట తెల్లకార్డులను తొలగించబోతున్నారనే ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది. ఏదిఏమైనా క్షేత్ర స్థాయి నుంచి జరిగే ఈ సర్వేలో ఏ మాత్రం లోపాలు చోటు చేసుకున్నా లేక రాజకీయ జోక్యం ఉన్నా అర్హులైన పేదలకు నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఈ సర్వే ఎలా జరుగుతుందనేది వేచి చూడాల్సిందే.