ఆంధ్రప్రదేశ్‌

కోల్డ్‌స్టోరేజీలో పోలవరం ప్రాజెక్టు: దేవినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 19: టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు 70 శాతం వరకు పూర్తిచేస్తే, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం పోలవరం ప్రాజెక్టును కోల్డ్‌స్టోరేజీలో పెట్టారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో దేవినేని మాట్లాడుతూ పోలవరం నిధులపై కలవరం, జాతీయ హోదా ఉన్నట్టా.. లేనట్టా, ఇలా ప్రతిరోజూ దినపత్రికల్లో పెద్దఎత్తున వార్తలొస్తున్నాయన్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ అసమర్థ పాలన కారణంగా పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే చందంగా మారిందన్నారు. ఆర్ అండ్ బీ రిటైర్డ్ ఇంజనీర్, వైఎస్ బంధువైన పీటర్‌ను తీసుకొచ్చి పీటర్ కమిటీ వేసి పోలవరం ప్రాజెక్టులో వేలకోట్ల అవినీతి జరిగిందని ఒక తప్పుడు నివేదిక ఇప్పించారన్నారు. ఆ నివేదికతో మన కన్ను మనమే పొడుచుకున్నట్లయిందన్నారు.
సభ్యసమాజం సిగ్గుపడేలా మంత్రుల పదజాలం: వర్ల
విజయవాడ(సిటీ): సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో ఏపీ మంత్రులు వాడుతున్న పదజాలం ఉందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. వైసీపీ నేతలు, మంత్రులు మాట్లాడుతున్న తీరును చూస్తున్న సీఎం జగన్ వౌనం పాటించడం సరికాదని మంగళవారం ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.