ఆంధ్రప్రదేశ్‌

జెరూసలెం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 19: జెరూసలేం వెళ్లే క్రిస్టియన్లకు ఆర్థిక సాయం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మంగళవారం జారీ చేసింది. 3 లక్షల వరకూ ఆదాయం ఉన్న వారికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని 40 వేల నుంచి 60 వేల రూపాయలకు, 3 లక్షల రూపాయల పైబడి ఆదాయం ఉన్న వారికి ఇచ్చే సాయం 20 వేల నుంచి 30 వేల రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ముస్లింలకు కూడా హజ్ యాత్రకు సంబంధించి 3 లక్షల రూపాయల వరకూ 60 వేల రూపాయలు, 3 లక్షల రూపాయలు పైబడి ఆదాయం ఉన్నవారికి 30 వేల రూపాయలు ఆర్థిక సాయంగా అందించనుంది.