ఆంధ్రప్రదేశ్‌

ఇసుకాసురులపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 19: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీలం సాహ్ని తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు చెక్‌పోస్టుల ఏర్పాటు అంశంపై పంచాయతీరాజ్, పోలీస్, గనులు, తదితర శాఖల అధికారులతో మంగళవారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దుల్లో అవసరమైన చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రం నుంచి ఇసుక అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని, వివిధ శాఖలు సమన్వయంతో పని చేయాలని కోరారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టర్ సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
సచివాలయ ఉద్యోగాల భర్తీకి సీఎస్ ఆదేశం
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లోని వివిధ కేటగరీల కింద ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో పంచాయతీరాజ్, యువజన సంక్షేమం, వ్యవసాయ, పురపాలక శాఖల అధికారులతో ఆమె మంగళవారం సచివాలయాల్లో ఖాళీల భర్తీపై సమీక్షించారు. త్వరితగతిన భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...అధికారులతో సమీక్షిస్తున్న సీఎస్ నీలం సాహ్ని