ఆంధ్రప్రదేశ్‌

ఐటీ విస్తృతికి కానె్సప్ట్ సిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 20: రాష్ట్రంలో ఐటీ, సంబంధిత పరిశ్రమలకు అవసరమైన కానె్సప్ట్ సిటీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాథమికంగా పది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వీటి ఏర్పాటుకు ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతి నగరాలతో పాటు, బెంగుళూరు సమీపంలో ఉన్న అనంతపురం నగరంలోనూ కానె్సప్ట్ సిటీల ఏర్పాటుకు తగిన ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. అమెరికాలోని ఇండియానా, కొలంబియా సిటీని ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్లపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. విశిష్ట శైలి నిర్మాణాలన్నీ ఆ సిటీలో ప్రతిబింబిస్తాయని, ఆ తరహాలోనే ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, హై ఎండ్ టెక్నాలజీకి చిరునామాగా కానె్సప్ట్ సిటీలు రూపు దిద్దుకోవాలని ముఖ్యమంత్రి అభిలషించారు. కంపెనీ సామర్థ్యానికి అనుకూలంగా భూముల కేటాయింపు ఉంటుందన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయదలచుకున్న వారికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయటంతో పాటు అవినీతి రహిత పారదర్శక విధానంలో వసతులు కల్పిస్తామన్నారు. ప్రోత్సాహక ధరల్లో భూములు, నీరు, విద్యుత్ అందించాలన్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా అవసరమైన మానవ వనరులను అందుబాటులోకి తెస్తామన్నారు. గత ప్రభుత్వంలో పాలసీల పేరు చెప్పి ప్రచారం చేసుకున్నా పరిశ్రమలకు చెల్లించాల్సిన రూ.4వేల కోట్ల ప్రోత్సాహకాలను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా ఎగ్గొట్టారని విమర్శించారు. ఇప్పుడు ఆయన ఈజ్ ఆఫ్ డూయింగ్, పారిశ్రామిక ప్రగతిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తిరుపతిలో క్యాంపస్ పెట్టేందుకు టీసీఎస్ సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి
తెలిపారు. ఇందుకు సంబంధించిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్న ఇంటర్నేషనల్ ఇనిసిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ పక్కనే హై ఎండ్ స్కిల్స్‌కు కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రపంచ సాంకేతిక రంగంలో వస్తున్న నూతన విధానాలు. పద్ధతులు, టెక్నాలజీ అంశాలపై బోధన, శిక్షణ సంస్థను ఏర్పాటు చేయటంపై ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. స్టార్టప్‌ల కోసం కూడా ఇదే ప్రాంగణంలో మరో నిర్మాణం చేపట్టాలన్నారు.

ఐటీ సద్వినియోగం కావాలి
ఐటీ శాఖలో ఉన్న అనేక విభాగాల్లో విధుల నిర్వహణపై సీఎం సమీక్షించారు. ఒకే పనిని రెండు, మూడు విభాగాలుగా చేయటంతో ఓవర్ ల్యాపింగ్ అవుతున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పెద్దఎత్తున నిధులు వెచ్చించి ఏపీ ఐటీ శాఖ పలు అప్లికేషన్లను అందుబాటులోకి తెచ్చిందని, అయితే ప్రభుత్వ విభాగాలతో సరైన సమన్వయం లేనందున కొత్త అప్లికేషన్ల కోసం ఆయా శాఖలు ప్రత్యేకించి మళ్లీ ఖర్చు చేస్తున్నాయని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వపరంగా ఉన్న వసతులు, మానవ వనరులు సక్రమంగా వినియోగించుకోలేక పోతున్నామన్నారు. ఇతర శాఖలు తయారు చేయిస్తున్న అప్లికేషన్లలో భద్రతా పరమైన లోపాలు కూడా ఉంటున్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఏ ప్రభుత్వ శాఖకు ఎలాంటి అప్లికేషన్ అవసరమైనా ముందుగా ప్రభుత్వ ఐటీ విభాగం అనుమతి తరువాతే ఆర్థిక శాఖకు పంపాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన సర్క్యులర్ జారీ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఐటీ విభాగంలో ఉన్న సదుపాయాలు, వసతులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. పనుల్లో ఎక్కడా డూప్లికేషన్ లేకుండా ఐటీ శాఖలోని ఒక్కో విభాగానికి ఒక్కో పనిని అప్పగించాలని నిర్దేశించారు. ఆర్టీజీఎస్‌కు ఎనలిటిక్స్ బాధ్యతను అప్పగించడం ద్వారా పూర్తి స్థాయిలో సేవలు పొంద వచ్చని అధికారులు సూచించగా సీఎం సానుకూలంగా స్పందించారు.
పాలనలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అత్యంత కీలకమైందని ఈ వ్యవస్థను సాంకేతిక పరిజ్ఞానంతో బలోపేతం చేయటం ద్వారా అవినీతిని నియంత్రించే వీలు కలుగుతుందని సీఎం జగన్ ఉద్ఘాటించారు. గ్రామ సచివాలయాలకు వచ్చే వినతుల పరిష్కారంలో అర్జీలు ఏ స్థాయిలో ఉన్నదీ కంప్యూటర్ల ద్వారా పరిశీలించ వచ్చన్నారు. రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ, పింఛన్, ఫీజు రీ యింబర్స్‌మెంట్ కార్డులు గ్రామ సచివాలయాల్లోనే ముద్రించి పంపిణీ చేయాలని, గ్రామ సచివాలయాలకు కలెక్టర్లు నేరుగా అనుసంధానం కావాలని ఆదేశించారు. గ్రామ సచివాలయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలంటే తగిన సమాచార, సాంకేతిక వ్యవస్థ అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. వివిధ పథకాల లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించటంతో పాటు మరింత మందికి అందించేందుకు ఐటీ వ్యవస్థ అవసరమన్నారు. గ్రామ సచివాలయాల్లో ప్రింటర్లు, కంప్యూటర్లు, స్కానర్లు, వలంటీర్లకు సెల్‌ఫోన్లు తదితర పరికరాలకు సంబంధించి కొనుగోళ్లు జరుపుతున్నట్లు తెలిపారు. ఏదైనా ఒక అర్జీ ఆమోదం పొందాక కంప్యూటర్‌లో గ్రీన్ కలర్ ఫ్లాగ్‌ను కేటాయించాలని సూచించారు. అవినీతి, పక్షపాతం లేకుండా అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలన్నారు.