ఆంధ్రప్రదేశ్‌

గృహ నిర్మాణంలోనూ రివర్స్ టెండరింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: గృహ నిర్మాణంలోనూ రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రధాన టెండర్లు తెరచిన మరుసటి రోజే రివర్స్ టెండర్లు పిలవాలని నిర్దేశించారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో టిడ్కోపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాన టెండర్లు, రివర్స్ టెండర్‌కు మధ్య ఎక్కువ సమయం ఉండరాదన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏపీ టిడ్కో పరిధిలో ఉన్న 65,969 ఫ్లాట్ల నిర్మాణంపై రివర్స్ టెండరింగ్ విషయమై సమీక్షించారు. ఇవన్నీ పునాది స్థాయిలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రజా ధనం ఆదా, పారదర్శక, అవినీతి రహిత విధానాల్లో వీటికి కూడా రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఇందులో భాగంగా ఈ నెల 22న 14,368 ఇళ్ల నిర్మాణానికి టెండరింగ్‌కు వెళ్తున్నామని అధికారులు తెలిపారు. తరువాత రోజే వీటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మిగిలిన ఇళ్లకు కూడా త్వరలోనే టెండర్లు పిలుస్తామని అధికారులు వివరించారు. గతంలో నిర్దేశించిన నిర్మాణ ప్రమాణాలను అలాగే ఉంచి రివర్స్ టెండరింగ్ పిలవాలని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఫ్లాట్ల కంటే పట్టణ పేదలకు మరిన్ని ప్లాట్లు కేటాయించాలని సూచించారు. దీనివల్ల ఫ్లాట్ల నిర్వహణపరంగా ఉన్న సమస్యలు తొలగి పోతాయని పేదలకు మేలు జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.