ఆంధ్రప్రదేశ్‌

ప్రకృతి సేద్యానికి జర్మన్ బ్యాంక్ చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 20: రాష్ట్రంలో పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు జర్మన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా బుధవారం సచివాలయంలో కేఎఫ్‌డబ్ల్యు ప్రతినిధుల బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీతో భేటీ అయింది. ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించేందుకు జర్మనీ అభివృద్ధి బ్యాంక్ నుంచి రుణానికై గత ఏడాది జనవరిలో ప్రాథమిక ప్రాజెక్ట్ ప్రతిపాదనతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఈ ప్రతిపాదనలను
కేంద్ర ఆర్థిక వ్యవహారాలశాఖ ఏప్రిల్ నెలలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం రూ. 2వేల 479 కోట్ల అంచనాలతో ప్రాజెక్ట్ నివేదిక పంపింది. అందులో రూ. 1735 కోట్లు కేఎఫ్‌డబ్ల్యూ రుణంగా అందించనుంది. మిగిలిన 30 శాతం రూ. 744 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది. కేఎఫ్‌డబ్ల్యు మొదటి దశ గ్రాంట్ కాంపొనెంట్‌తో కలిపి రూ. 694 కోట్లు, రెండో దశలో రూ. 1041 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనల ప్రకారం రుణ మంజూరుకు సంబంధించి ఈ నెలలో కేఎఫ్‌డబ్ల్యూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందంపై సంతకాలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో సీఎస్‌తో ప్రతినిధి బృందం భేటీ అయింది. రుణ మంజూరు ఒప్పందంపై సంతకాలు పూర్తయిన అనంతరం కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంక్ తొలి విడత నిధులు విడుదల చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ అమలులో భాగంగా రాష్ట్రంలో 1725 గ్రామ పంచాయతీలకు చెందిన 7 లక్షల మంది రైతులను పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 25 లక్షల మంది రైతులను మాస్టర్ ఫార్మర్లుగా తీర్చిదిద్ది పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లుగా నియమిస్తారు. మరో 69వేల మందితో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటుచేసి ప్రకృతి సేద్యం అమలు, మానిటరింగ్ చేపట్టేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. కాగా రాష్ట్రంలో పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చిన జర్మన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ప్రతినిధి బృందానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎస్ నీలం సాహ్ని కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు టీ విజయకుమార్ ప్రకృతి వ్యవసాయం అమలు తీరు, ప్రాజెక్ట్ విస్తరణ ద్వారా జర్మన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌కు పంపిన ప్రాజెక్ట్ ప్రతిపాదనల వివరాలను సీఎస్‌కు వివరించారు. ఈ భేటీలో కేఎఫ్ డబ్ల్యూ ప్రతినిధులు డాక్టర్ క్రిస్ట్ఫ్. కెస్లర్, సంగీత అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... సీఎస్ నీలం సాహ్నితో భేటీ అయిన జర్మన్ డెవలప్‌మెంట్ బ్యాంకు ప్రతినిధులు