ఆంధ్రప్రదేశ్‌

ఆంగ్ల మాధ్యమంపై ఉపాధ్యాయ సంఘాల్లో మిశ్రమ స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న సీఎం వైఎస్ జగన్ నిర్ణయం పట్ల గత కొద్ది రోజులుగా ఓ వైపు సానుకూలత, మరో వైపు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని తప్పని సరి చేస్తూ బుధవారం జీవో 81న జారీ చేసింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నుంచి మిశ్రమ స్పందన కన్పిస్తున్నది. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ ఉపాధ్యాయులు ఈ జీవోను పూర్తిగా స్వాగతిస్తుంటే అగ్రవర్ణ ఉపాధ్యాయులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక తెలుగు భాషాభిమానులు మాత్రం ఈ జీవోను ముక్తకంఠంతో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కనీసం ప్రాథమిక పాఠశాలల్లో మాతృ భాషలో విద్యాబోధన ఉంటే మేలు అంటున్నారు. ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ రవిప్రసాద్ మాట్లాడుతూ పరిసరాల విజ్ఞానం, గణితం, మనోవిజ్ఞానశాస్త్రం వంటి శాస్త్రాలను మాతృభాషలో బోధించడం వలన విద్యార్థులు పూర్తి స్థాయిలో అర్ధం చేసుకోగల్లుతారని అన్నారు. నేడు ప్రపంచంలో అగ్రగామిగా నిలిచిన చైనా, రష్యా, జపాన్, కొరియా వంటి దేశాల్లో విద్యాభ్యాసం మాతృభాషలోనే జరుగుతుందని, తాజాగా భారతదేశ నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కూడా 1 నుంచి 8వ తరగతులకు మాతృభాషలోనే విద్యను అందించాలని సూచించిందన్నారు. వాస్తవానికి నేడు విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో పుస్తకాలను బట్టీ పట్టి చదువుతున్నారు మినహా విషయాన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవటం లేదు. 1970, 80, 90 దశకాల్లో మన రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లి వేర్వేరు రంగాల్లో స్థిరపడిన వారంతా ఇక్కడ తెలుగు మాధ్యమంలోనే చదివారన్నది మరువరాదు. భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ తమతమ మాతృ భాషల్లోనే విద్యనభ్యసించారన్నది కూడా మరువరాదు.