ఆంధ్రప్రదేశ్‌

‘పోలవరం’ వద్ద పనుల సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన స్పిల్‌వేలో కాంక్రీటు పనులు గురువారం నుంచి పునః ప్రారంభమయ్యాయి. గత ఆరు నెలలుగా ఎటువంటి పనులకు నోచుకోని ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం కావటంతో మళ్లీ సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ ప్రభుత్వంలో నవయుగ కాంట్రాక్టు ఏజన్సీ పనులు చేస్తుండగా, కొత్తగా వైసీపీ ప్రభుత్వం రావటంతో పనులను నిలిపివేసి రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన సంగతి విదితమే. దీనితో కాంట్రాక్టును మెగా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. ఆ సంస్థ ఈ నెల 1న భూమి పూజ చేసింది. ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా రావటంతో ఇసుక చేరింది. దానిని తొలగించి స్పిల్‌వేకు రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు స్పిల్‌వేలోని 1వ బ్లాక్ వద్ద జలవనరుల శాఖ ఎస్‌ఈ ఎం నాగిరెడ్డి, ఈఈ ఏసుబాబు, మెగా సంస్థ జీఎం సతీష్‌బాబులు పూజలు నిర్వహించిన అనంతరం ఒకటవ బ్లాక్ వద్ద కాంక్రీటు పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఈ నాగిరెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ రివర్స్ టెండరింగ్‌లో పనులు దక్కించుకున్న మెగా ఇంజినీరింగ్ సంస్థ స్పిల్‌వేలో కాంక్రీటు పనులను ప్రారంభించినట్టు తెలిపారు. నాన్ ఓవర్ ఫ్లో సెక్షన్‌లో కాంక్రీటు వేశామన్నారు. పనులకు షెడ్యూల్ తయారు చేసుకున్నామని, ఆ ప్రకారం పనులు వేగవంతం చేసి 24 నెలల్లో
స్పిల్‌వే నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. కాంక్రీటులో భాగమైన కూలింగ్ ప్లాంటు కూడా సిద్ధంగా ఉంది కాబట్టి ఎటువంటి ఆటంకం లేకుండా పనులు జరుగుతాయన్నారు. స్పిల్‌వేలో కాంక్రీటు పనులు చేస్తూ గేట్లు అమరుస్తామన్నారు. మరో పది రోజుల్లో స్పిల్ ఛానల్, కాపర్ డ్యాంతోపాటు అన్ని విభాగాల్లో పనులు ప్రారంభించి వేగవంతం చేస్తామని ఎస్‌ఈ నాగిరెడ్డి తెలిపారు. మెగా సంస్థ జీఎం సతీష్‌బాబు మాట్లాడుతూ కాంక్రీటు పనుల్లో గురువారం 200 క్యూబిక్ మీటర్ల కాంక్రీటును వేస్తున్నామన్నారు. రోజుకు 2వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేయడానికి యంత్ర సామాగ్రితోపాటు సిబ్బంది, కార్మికులను సిద్ధం చేసుకుంటున్నామన్నారు. స్పిల్‌వేలో కాంక్రీటు పనులు చేయడానికి వాహనాల రాకపోకలకు రోడ్డు మార్గాలను సిద్ధం చేస్తున్నామని, వరదల కారణంగా స్పిల్ ఛానల్‌లో చేరిన వరద నీటిని తోడించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అన్ని పనులు ప్రారంభించి వేగవంతం చేస్తామని సతీష్‌బాబు తెలిపారు. కార్యక్రమంలో ఈఈలు బాలకృష్ణ, శ్రీనివాసరావు, ప్రాజెక్టు మేనేజర్ పి మురళీ, ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ ఠాకూరు, జలవనరుల శాఖ ఇంజినీర్లు, కాంట్రాక్టు ఏజన్సీ ఇంజినీర్లు పాల్గొన్నారు.