ఆంధ్రప్రదేశ్‌

ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో నేరాల నియంత్రణ సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 21: ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో నేరాల నియంత్రణ సాధ్యమని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో రష్యాకు చెందిన ఎన్‌ఎన్‌టీసీ సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రతినిధులతో గురువారం మంత్రి మేకపాటి సమవేశమయ్యారు. కళ్లకు స్మార్ట్ గ్లాసెస్ ధరించి మనుషుల ముఖాలను గుర్తించే టెక్నాలజీని మంత్రికి వివరించారు. కెమెరా సాయంతో మనిషి ముఖాన్ని గుర్తించే టెక్నాలజీ ఆధారంగా నేరాల నియంత్రణ సాధ్యమని, పోలీస్ వ్యవస్థకు ఇది ఎంతో ఉపయోగకరమని మంత్రి అభిప్రాయపడ్డారు. ఎర్ర చందనం స్మగ్లర్లను గుర్తించేందుకు, ప్రభుత్వ కార్యక్రమాలు, రద్దీగా ఉండే ప్రాంతాల వద్ద వీటిని ఎక్కువగా వినియోగించుకోవచ్చన్నారు. అయితే డేటా బేస్‌లో అనుమానితులు, ఖైదీల ఫోటోలు ముందుగానే నిక్షిప్తం చేయాల్సి ఉంటుందన్నారు. ఒక సెకనులో వీడియో ఫ్రేమ్‌లో 15 ముఖాలను గుర్తించగలదని, డేటా బేస్‌లో 10 లక్షల ముఖాలను నిల్వ చేసే సామర్థ్యం ఉంటుందని వివరించారు. ఈ టెక్నాలజీ వినియోగం వల్ల లాభనష్టాలను విశే్లషించాలని డీజీపీ గౌతం సవాంగ్‌ను ఫోన్‌లో మంత్రి ఆదేశించారు. అనంతరం మంగళగిరిలోని కార్యాలయంలో డీజీపీని ఈ కంపెనీ ప్రతినిధులు కలిసి టెక్నాలజీ గురించి వివరించారు.
*చిత్రం... రష్యా కంపెనీ తయారుచేసిన స్మార్ట్ గ్లాసెస్‌తో మంత్రి మేకపాటి