ఆంధ్రప్రదేశ్‌

ఇసుక వారోత్సవాలు సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 21: ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ కొత్త పాలసీ ద్వారా ఇసుకను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇసుక వారోత్సవాలు విజయవంతం అయ్యాయి. ఈ నెల 14 నుంచి 21 వరకూ ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. గత మూడు నెలలుగా వర్షాలు, వరదల కారణంగా ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. వర్షాలు, వరదలు తగ్గగానే 275 ఇసుక రీచ్‌ల్లోనూ ఇసుకను త్వవకాలు ముమ్మరం చేసేందుకు ఇసుక వారోత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా భవన నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుక లభ్యత పెంచేందుకు ఈ వారోత్సవాలను ప్రతిపాదించింది. అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలు ప్రారంభించడం, స్టాక్ పాయింట్లు, ఇసుక డిపోల నుంచి వినియోగదారులకు అందించే ప్రక్రియ వారం రోజులుగా ఊపందుకుంది. నదుల్లో ఇసుక సహా పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలను కూడా అధికార యంత్రాంగం వేగవంతం చేసింది. దీంతో ఇసుక వారోత్సవాలు పూర్తి అయ్యే నాటికి లక్ష్యాన్ని అధిగమించి 2.8 లక్షల టన్నులకు చేరుకుంది. రాష్ట్రంలో ఇసుక లభ్యత పెరగడంతో ధర తగ్గింది. ఇసుక తవ్వకాలకు రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా తక్కువ ధరకే వినియోగదారులకు ఇసుక అందుబాటులోకి వస్తోంది. రవాణా చార్జీలను కూడా శాస్ర్తియంగా నిర్ణయించడంతో ఇసుక రేట్లు నిర్మాణదారులకు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఇసుక మాఫియా నిర్ణయించిన రేట్లకే వినియోగదారులు కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితికి భిన్నంగా ఇసుక విక్రయాలను క్రమబద్ధీకరిస్తూ, కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావడం వల్ల మాఫియా దోపిడీకి అడ్డుకట్ట పడింది. ఇసుక అక్రమ రవాణాపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇసుకను అధిక ధరలకు విక్రయించినా, బ్లాక్ మార్కెట్‌కు తరలించినా రెండు లక్షల రూపాయల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఫిర్యాదులను స్వీకరించేందుకు టోల్‌ప్రీ నెంబర్ ఏర్పాటు, 35 చెక్‌పోస్టుల ఏర్పాటు ద్వారా ఇసుక అక్రమ రవాణా నిరోధించడం సాధ్యమైంది.