ఆంధ్రప్రదేశ్‌

ఉద్రిక్తతల నడుమ బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ/ఏలూరు, సెప్టెంబర్ 10: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలన్న డిమాండ్‌తో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పిలుపుమేరకు ఉభయ గోదావరి జిల్లాల్లో శనివారం బంద్ ప్రశాంతంగా ముగిసింది. వామపక్ష పార్టీలు కూడా ఈ బంద్‌లో పాల్గొన్నాయి. కాకినాడ సహా పలుచోట్ల బంద్‌ను విజయవంతం చేసేందుకు వైకాపా, వామపక్ష పార్టీలు కృషి చేశాయి. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను స్థానిక భానుగుడి జంక్షన్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు దగ్ధం చేశారు. బస్సులు తిరగకుండా ఆందోళనకారులు అడ్డుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వాణిజ్య సముదాయాలు, దుకాణాలను మూయించివేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కాకినాడ సిటీ కో-ఆర్డినేటర్ ముత్తా శశిధర్, మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ తదితరులు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రవరంలో బంద్ ఉద్రిక్తంగా సాగింది. బంద్ సందర్భంగా జరిగిన ఆందోళనలో సుమారు 120 మందిని పోలీసులు అరెస్టు చేసి అనంతరం విడిచిపెట్టారు. అరెస్టైన వారిలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, సిపిఎం నాయకులు టి అరుణ్, సిపి ఐ నాయకులు మీసాల సత్యనారాయణ, నల్లా రామారావు, వైసిపి నాయకులు షర్మిలారెడ్డి తదితరులు వున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పాక్షికంగా సాగింది. జిల్లా అంతటా వేలసంఖ్యలో అరెస్టులు జరుగగా కొంతమంది వైసిపి నేతలను గృహనిర్బంధం చేశారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ఇతర జిల్లా నేతలను ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటరులో జరిగిన నిరసన కార్యక్రమంలో పోలీసులు అరెస్టు చేశారు. నాయకులు కనిపిస్తే చాలు జీపులు ఎక్కించి స్టేషన్లకు తరలించారు. శనివారం తెల్లవారుఝాము 4గంటలకు పలు బస్‌డిపోల వద్ద వైసిపి, వామపక్షాల నేతలు బస్సులను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేసినా ఆసమయంలోనూ పోలీసులు నాయకులను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. దీంతోపాటు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అయా ప్రాంతాల్లో క్రియాశీలకంగా ఉండవచ్చునని భావించే నాయకులను కూడా పోలీసులు గృహనిర్బంధంలోగాని, పోలీసుస్టేషన్‌లోగాని ఉంచేశారు.ఏలూరులో వైసిపి జిల్లా అధ్యక్షులు ఆళ్ల నానిని గృహనిర్బంధం చేశారు. అలాగే నర్సాపురంలో వైసిపి నేత ముదునూరి ప్రసాదరాజును కూడా గృహనిర్బంధం చేశారు. అలాగే పలుప్రాంతాల్లో ఆపార్టీ కీలకనేతలు ఇల్లు విడిచి బయటకు రాకుండా పోలీసు పహారా కొనసాగింది.

చిత్రం.. రాజమహేంద్రవరంలో వామపక్ష నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు