ఆంధ్రప్రదేశ్‌

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న రీడర్లతో సహా ఏ ఒక్కరినీ తొలగించబోమని, విద్యుత్ కాంట్రాక్టులు, కొనుగోళ్లలో ప్రజాధనాన్ని దుర్వినియోగం కానీయమని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఏపీ ట్రాన్స్‌కోలోకి నూతనంగా ఎంపికైన 170 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు నియామక ఉత్తర్వులు అందించే కార్యక్రమాన్ని సోమవారం విజయవాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై నూతనంగా ఎంపికైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించి ప్రోత్సహించడమే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమన్నారు. అందుకనుగుణంగానే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు మాసాల్లోనే విద్యుత్ శాఖలో 8వేల మంది ఎనర్జీ అసిస్టెంట్లను
నియమించామని, ఇప్పుడు 170 మంది ఏఈఈలను నియమిస్తున్నామన్నారు. ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న 4500 మంది విద్యుత్ రీడర్లను కూడా తొలగించవద్దని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. పోలవరం జల విద్యుత్ కేంద్రం రివర్స్ టెండరింగ్‌లో రూ. 800కోట్లు ఆదా అయిందని, విద్యుత్ కొనుగోళ్లలో కూడా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చేస్తున్నామన్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒకవైపు ప్రభుత్వశాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీచేస్తూ మరోవైపు అభివృద్ధి సంక్షేమాలను సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ విద్యత్ సరిపడినంత ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. విద్యుత్ వ్యవస్థలో కీలకమైన సబ్ స్టేషన్‌లలో ఉండే ఏఈఈలను నియమించడం ఆనందంగా ఉందన్నారు. ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ మాట్లాడుతూ అవినీతి రహిత పాలనను అందించాలనేది ప్రభుత్వ ధ్యేయమని, నూతనంగా నియమితులైన ఏఈఈలు విద్యుత్ వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా అవినీతి రహితంగా పని చేయాలన్నారు. విద్యుత్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయడం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లోనే రూ. 500కోట్లు, జెన్‌కోలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 180 కోట్లు ఆదా చేశామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యుత్ ఉద్యోగం సంఘాల నాయకులు లక్ష్మణరావు, వేద వ్యాసరావు మాట్లాడుతూ విద్యుత్ శాఖలో ఏఈఈలు పిల్లర్స్ లాంటి వారని అటువంటి కీలకమైన ఉద్యోగాలను భర్తీ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స్ జేఎండీ కే వెంకటేశ్వరరావు, విద్యుత్ శాఖ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి