రాష్ట్రీయం

‘దిశ’ కేసులో రేపిస్టులను కఠినంగా శిక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, డిసెంబర్ 2: జస్టిస్ ఫర్ దిశ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ నుంచి షాద్‌నగర్ మీదుగా కర్నూల్‌కు రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు షాద్‌నగర్ బైపాస్ వద్ద స్థానిక టీడీపీ శ్రేణులు స్వాగతం పలికారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ శంషాబాద్‌లో ఇటీవల చోటు చేసుకున్న జస్టిస్ ఫర్ దిశ వ్యవహారం సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేసిందని, నేరస్థులను ప్రభుత్వం కఠినంగా శిక్షించే విధంగా సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ విమానాశ్రాయానికి అతి సమీపంలో పశువైద్యురాలిపై ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం యావత్ భారత్‌ను తలదించుకునేలా ఉందని అన్నారు. 44వ జాతీయ రహదారిపై అనునిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం తనను తీవ్రంగా కలచి వేసిందని భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మానవ మృగాలను తక్షణమే శిక్షించి మరోమారు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
హైదరాబాద్ నుంచి షాద్‌నగర్ మీదుగా కర్నూలు వెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికేందుకు వచ్చిన షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలును అనుమతి లేదంటూ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించడాన్ని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఖండించారు.