ఆంధ్రప్రదేశ్‌

తిరుమల స్ఫూర్తితో.. ప్రధాన దేవాలయాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, మార్చి 25: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దేవాలయం స్ఫూర్తితో ప్రధాన దేవాలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రణాళికలు రచిస్తుంది దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జెఎస్‌వి ప్రసాద్ అన్నారు. సింహాచల క్షేత్రంలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. శ్రీశైలం దివ్యక్షేత్రం అభివృద్ధిపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నామని ఆయన అన్నారు. పచ్చదనంతో పాటు భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. 2 వేల సంవత్సరంలో తాను విశాఖ కలెక్టర్‌గా పని చేసిన కాలంలోనే సింహాచలం దివ్యక్షేత్రం పనులకు ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ నేపథ్యంలో దశల వారీగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. పచ్చదనం పనులను దేవస్థానం ఇప్పటికే చేపట్టిందని తెలిపారు. కొండ దిగువ పుష్కరిణి, పూలతోట, వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం, గోశాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలనే విషయమై అధికారులకి సూచనలు చేశామన్నారు. సింహగిరికి వచ్చే విఐపిల కోసం సుమారు నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో భవనం నిర్మించేందుకు దాతలు ముందుకు వచ్చారని, త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేస్తామని ప్రకటించారు. అంతకు ముందు సింహాచలేశుని దర్శించుకున్నారు.