ఆంధ్రప్రదేశ్‌

నేడు అనంతకు జగన్ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 4: ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పెనుకొండ సమీపంలో ఎర్రమంచి వద్ద ఏర్పాటు చేసిన దక్షిణ కొరియాకు చెందిన కార్ల దిగ్గజం కియా కంపెనీలో కియా మోటార్స్ గ్రాండ్ సెర్మనీని సీఎం ప్రారంభిస్తారు. ఉదయం 9.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 10.30 గంటలకు పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కియా పరిశ్రమకు చేరుకుని ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ కియాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రితో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా తదితరులు పాల్గొంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి శంకరనారాయణ, కలెక్టర్ గంధం చంద్రుడు, ఎస్పీ బూసారపు సత్యయేసు బాబు పర్యవేక్షించారు.

*చిత్రం... ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి