ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ చార్జీలు పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 4: వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. గృహ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి 500 యూనిట్ల లోపు వినియోగదారులకు చార్జీలను యథాతథంగా ఉంచుతూ ఆపై వినియోగించే వారికి శ్లాబ్ పద్ధతి అమలు చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. వ్యాపార, వాణిజ్య, హెచ్‌టీ వినియోగదారులకు మాత్రం చార్జీల వడ్డన తప్పలేదు. ఇందుకు సంబంధించి విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) బుధవారం ప్రతిపాదనలు అందించాయి. వీటిపై ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ప్రభుత్వం
ఆమోదిస్తే పెంచిన చార్జీలు అమల్లోకి వస్తాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను విద్యుత్ పంపిణీ సంస్థలు తమ వార్షిక ఆదాయ అవసరాలు, ప్రతిపాదిత విద్యుత్ చార్జీల వివరాలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్‌సీ)కి సమర్పించాయి. ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఏపీఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి, ఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాధరావు పంపిణీ సంస్థల ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డికి బుధవారం అందజేశారు. గృహ వినియోగంలో నెలకు 500 యూనిట్ల లోపు వినియోగదారులకు ఏ విధమైన పెంపుదల లేదు. దీంతో రాష్ట్రంలో ఉన్న దాదాపు కోటీ 50 లక్షల గృహ వినియోగదారులకు ఊరట కలగనుంది. రాష్ట్రంలోని 98 శాతం మంది వినియోగదారులకు చార్జీల సవరణ నుంచి మినహాయింపు లభిస్తుంది. గత ఏడాది వినియోగం ఆధారంగా ఈ ఏడాది స్లాబ్‌ను నిర్ణయించే విధానానికి స్వస్తి పలకడం ద్వారా కొంత వెసులుబాటు కల్పించామని ఇంధన శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. దీనివల్ల విద్యుత్ పంపిణీ సంస్థలకు దాదాపు రూ. 60 కోట్ల మేర ఆదాయం తగ్గుతుంది. అయినప్పటికీ వినియోగదారుల సౌలభ్యం కోసం పంపిణీ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. నెలవారీ గృహ వినియోగం 500 యూనిట్లు దాటిన వినియోగదారులకు అత్యధిక శ్లాబ్‌లో స్వల్పంగా చార్జీలు సవరించారు. రైల్వే ట్రాక్షన్, స్థానిక సంస్థలు, గ్రామీణ విద్యుత్ సహకార సంస్థలు, హెచ్‌టీ వాణిజ్య సంస్థలు, సాగునీటి ఎత్తిపోతల పథకాలు, ఇతరత్రా విద్యుత్ పంపిణీ సేవకు అయ్యే ఖర్చుకు అనుగుణంగా విద్యుత్ చార్జీలు సవరించాలని నిర్ణయించారు.
2020-21 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ అమ్మకాలు - 62678 మిలియన్ యూనిట్లు.
కొనుగోలు- 69974 మిలియన్ యూనిట్లు
వార్షిక ఆదాయ అవసరాలు- రూ. 44841 కోట్లు
ప్రస్తుత చార్జీలు, ఇతరత్రా వచ్చే ఆదాయం- రూ. 30400 కోట్లు
ప్రతిపాదిత చార్జీల ద్వారా వచ్చే ఆదాయం- రూ. 31773 కోట్లు
ప్రతిపాదిత చార్జీల తరువాత ఆదాయ వ్యత్యాసం- రూ. 13068 కోట్లు
ఈ వ్యత్యాసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ ద్వారా పూడ్చుకోగలమని ఇంధన శాఖ భావిస్తోంది.
సరాసరి విద్యుత్ సేవకు అయ్యే ఖర్చు యూనిట్‌కు రూ. 7.15
సరాసరి రాబడి- రూ. 5.07
సరాసరి విద్యుత్ కొనుగోలుకు అయ్యే ఖర్చు యూనిట్‌కు రూ. 4.84
విద్యుత్ పంపిణీ సంస్థల ప్రతిపాదనలను నియంత్రణ మండలి సమీక్ష జరిపి ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన అనంతరం తగిన ఉత్తర్వులు జారీ అవుతాయి. కొత్త విద్యుత్ చార్జీలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
పెంపునకు ప్రతిపాదించిన చార్జీల వివరాలిలా ఉన్నాయి.

ఎల్‌టీ కనెక్షన్లు
---------
కేటగిరి-1: గృహ వినియోగదారులు- 51.30 లక్షలు
500 యూనిట్ల వరకు మార్పులు ఉండవు, 500 యూనిట్లు పైబడితే యూనిట్‌కు శ్లాబ్‌ను బట్టి రూ. 9.05 నుంచి రూ. 9.95 వరకు చార్జీలు వసూలు చేస్తారు.
కేటగిరి-2 ఏ,బీ (వాణిజ్యం)- వినియోగదారులు 5.58 లక్షలు
ప్రస్తుతం వసూలు చేస్తున్న చార్జీ యూనిట్‌కు రూ. 11.75, ప్రతిపాదిత చార్జీలు యూనిట్‌కు రూ. 12.25
కేటగిరి-3 (పరిశ్రమలు)- వినియోగదారులు- 19వేలు-
ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి అమల్లో ఉంటాయి.
కేటగిరి-4 (స్థానిక సంస్థలు)- 30వేలు
ఇప్పటి వరకు అమల్లో ఉన్నది యూనిట్‌కు రూ. 4 నుంచి రూ. 7.05
తాజా టారిఫ్ ప్రకారం మొత్తంగా యూనిట్‌కు రూ. 7 నిర్ణయించారు.
కేటగిరి-4 (మతపరమైన సంస్థలు)- యూనిట్‌కు రూ. 4.80 నుంచి రూ. 5 వసూలు చేస్తున్నారు. తాజా ప్రతిపాదనల్లో యూనిట్‌కు మొత్తంగా రూ. 5 వసూలు చేయనున్నారు.
కేటగిరి-5 (వ్యవసాయం, ఆక్వా, అనుబంధ పరిశ్రమలు)- 2.68 లక్షలు
వ్యవసాయం, రైతులకు ప్రస్తుతం నెలసరి 200 హెచ్‌పీ వరకు యూనిట్‌కు రూ. 2.50
హేచరీస్, ఫుడ్ మిక్సింగ్ ప్లాంట్లకు యూనిట్ రూ. 3.85 నుంచి రూ. 4.50కు పెంచేందుకు ప్రతిపాదించారు.
ఎల్‌టీ: కేటగిరి-2, హెచ్‌టీ: కేటగిరి-2 (్ఫంక్షన్ హాల్స్) ప్రస్తుత చార్జీలు యూనిట్‌కు రూ. 11.75 ప్రతిపాదిత చార్జీలు రూ. 12.25
హెచ్‌టీ: కేటగిరి-2 (కమర్షియల్)- 33కేవీ వరకు ప్రస్తుతం యూనిట్‌కు రూ. 6.95 కాగా తాజా సవరణ ప్రకారం యూనిట్‌కు రూ. 7.50, 132 కేవీ సర్వీస్‌లకు ప్రస్తుతం రూ. 6.70 వసూలు చేస్తుండగా ఇకపై రూ. 7.35 వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి.
హెచ్‌టీ: కేటగిరి 3 (పరిశ్రమలు), కేటగిరి-5 (ఆక్వా కల్చర్) 2వేల కనెక్షన్లు ఉన్నాయి..వీటికి ధరలు నిర్ణయించలేదు
ఎల్‌టీ, హెచ్‌టీ : కేటగిరి-4సీ (మతపరమైన సర్వీస్ కనెక్షన్లు)- 2వేలు
హెచ్‌టీ కనెక్షన్లు
-----------
కేటగిరి-4 (సీపీడబ్ల్యు, పీడబ్ల్యు)- యూనిట్‌కు రూ. 4.85 నుంచి రూ. 7కు ప్రతిపాదన
కేటగిరి-4 (రైల్వే ట్రాక్షన్లు)- యూనిట్‌కు రూ. 3.50 నుంచి రూ. 7కు పెంపుదల
కేటగిరి-5 (హేచరీస్, ఫుడ్ మిక్సింగ్ ప్లాంట్లు) యూనిట్‌కు రూ. 4.85 నుంచి రూ. 5.25
కేటగిరి-5 (ఎత్తిపోతల పథకాలు) యూనిట్‌కు రూ. 5.80 నుంచి రూ. 6.15కు పెంచుతూ డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించాయి.

*చిత్రం... ఏపీఈఆర్‌సీ చైర్మన్ నాగార్జున రెడ్డికి విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు అందజేస్తున్న ఏపీఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి, ఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాధరావు