ఆంధ్రప్రదేశ్‌

కడపలో ఉక్కు కర్మాగారానికి గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కర్మాగారానికి పేరు, ఏర్పాటు చేసే ప్రాం తం, శంకుస్థాపన తేదీ ఖరారు చేసింది. శంకుస్థాపన, నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వీలుగా 62 కోట్ల రూపాయలను కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో కడప జిల్లా సమగ్ర ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ప్రతిపాదించారు. అయితే ఈ ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాల్సిందిగా
కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేసింది. ఉక్కు రంగంలో ఆధునిక టెక్నాలజీగా భావించే బీఎఫ్-బీవోఎఫ్‌తో కంపెనీని నిర్వహిస్తే పెట్టుబడులపై ఆదాయపు పన్ను చెల్లింపునకు ముందు 18.95 శాతం మేర లాభాలు వస్తాయంటూ టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశాల్లో మెకన్ సంస్థ అందచేసిన ముసాయిదా నివేదికలో పేర్కొనడాన్ని ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. ఇది చాలా ప్రోత్సాహకరమైన అంశమని తెలిపింది. ఇనుప ఖనిజం లభ్యతపై, తుది నివేదికను మెకన్ సంస్థ అందచేసిందని ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ ఉక్కు కర్మాగారానికి ఏపీ హై గ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌గా పేరు పెట్టింది. జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లి, పెద్దనందలూరు గ్రామాల మధ్య దీనిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో 250 కోట్ల రూపాయలు కర్మాగారం ఏర్పాటుకు కేటాయించింది. 2013 కంపెనీల చట్టం కింద నూరు శాతం ఏపీ ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రైవేట్ కంపెనీగా ఏర్పాటు చేయనుంది. ప్రైవేట్ పెట్టుబడిదారుతో కర్మాగారం ఏర్పాటు చేస్తారు. పెయిడ్ అప్ క్యాపిటల్‌గా 10 లక్షల రూపాయలను కేటాయించింది. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ (ఇన్‌క్యాప్)లో కార్యాలయాన్ని ఈ ఉక్కు కర్మాగార కార్యాలయంగా పేర్కొంది. ముందుగా పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ భార్గవ్‌ను, గనుల శాఖ సెక్రటరీ కె.రామ్ గోపాల్‌ను డైరెక్టర్లుగా నియమించింది. ఈ నెల 26న ముఖ్యమంత్రి కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు. బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా 62 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థలం చదును, అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు, శంకుస్థాపన కార్యక్రమానికి 4 కోట్ల రూపాయలు, మార్కెట్ స్టడీ సహా సాధ్యాసాధ్యాల అధ్యయానికి 3 కోట్ల రూపాయలు, ఇతర ఖర్చుల నిమిత్తం 5 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.