ఆంధ్రప్రదేశ్‌

ఉపాధి పనుల్లో అలసత్వాన్ని సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 4: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాలతో పాటు ఇతర శాఖల పరిధిలో ఉపాధి హామీ పనులను తక్షణమే ప్రారంభించాలని అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఈ విషయమై బుధవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్, పలువురు ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి ఉపాధి హామీ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈనెల 15 లోగా అన్ని పనులకు పాలనామోదం, 18 లోగా సాంకేతిక అనుమతులు పొందాలన్నారు. ఈనెల 21 నాటికి కచ్చితంగా మార్కింగ్ ఇచ్చి పనులు ప్రారంభించాలని, నెలాఖరులోగా ఎఫ్‌టీఒ అప్‌లోడ్ చేయాలన్నారు. గ్రామాల్లో ప్రాధాన్యతా క్రమంలో ఐదు పనులు చేపట్టాలని ఆదేశించారు. మొదటి దశలో గుర్తించిన గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం, ప్రాధాన్యతా క్రమంలో సీసీ డ్రెయినేజీలు, ఉగాది నాటికి అందించే ఇళ్ల స్థలాలకు సంబంధించిన మెరక పనులు, మనబడి నాడు-నేడు కింద గుర్తించిన పాఠశాలలకు ప్రహరీల నిర్మాణం, నిర్లక్ష్యానికి గురైన గ్రామాల్లో చేపట్టాల్సిన సీసీ రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు. జిల్లాల్లో ఉపాధి హామీపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పనులు, నాణ్యతలో రాజీపడరాదన్నారు. ఉపాధి పనుల్లో భాగంగా నాడు- నేడు స్కూళ్లకు ప్రహరీ నిర్మాణాలకు నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్‌డబ్ల్యుఎస్ (గ్రామీణ నీటి సరఫరా పథకం) కింద ఉన్న వాటర్ షెడ్ ట్యాంక్‌లకు రంగులు వేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో సీసీ డ్రెయిన్లు పూడిపోకుండా కవరింగ్ పనులు చేపట్టాలని, సక్రమంగా పనులు చేసే కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. ప్రాధాన్యతా పనులకు బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఇప్పటికే రూ. 15 కోట్లు కేటాయించామని, ఈ నిధుల నుంచి జరిగిన పనులకు వెంటనే మూడు విడతల్లో బిల్లులు చెల్లించాలని స్పష్టం చేశారు. ఇసుక పాలసీలో భాగంగా చెక్‌పోస్ట్‌ల విషయంలో కలెక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 91 చెక్‌పోస్టులు సిద్ధమయ్యాయని ఇంకా 242 పూర్తి కావాల్సి ఉందన్నారు. ఆర్థిక భారం లేకుండా నిధులు మంజూరు చేస్తున్నాం.
*చిత్రం... వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి