ఆంధ్రప్రదేశ్‌

హెరిటేజ్ ఫ్రెష్ మాదని నిరూపిస్తే రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 10: హెరిటేజ్ ఫ్రెష్ సంస్థ తమ సొంతదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధమని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు. శాసనసభలో ఉల్లి సమస్యపై చర్చ సందర్భంగా చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్‌లో కిలో ఉల్లి రూ. 200కు విక్రయిస్తుంటే ప్రభుత్వం రూ. 25కే అందుబాటులోకి తెచ్చిందని
దీనిపై సభలో శవ రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ రాష్ట్రంలో ఉల్లి ధరలు పెరుగుతుంటే ప్రభుత్వ పరంగా ఏ రకమైన చర్యలు తీసుకున్నారని ప్రజా సమస్యలపై నిలదీస్తుంటే వ్యక్తిగతంగా అసత్య ఆరోపణలు చేసి తప్పించుకోవటం ప్రభుత్వానికి రివాజుగా మారిందని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు తీస్తున్న ఉల్లి గురించి అడిగితే హెరిటేజ్ ఫ్రెష్ గురించి మాట్లాడటమేమిటని ధ్వజమెత్తారు. హెరిటేజ్ ఫ్రెష్ ఫ్యూచర్ గ్రూప్‌కు విక్రయించామని మరోసారి గుర్తుచేశారు. ఇందులో తమకెలాంటి భాగస్వామ్యం లేదన్నారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ వరకు మాత్రమే లావాదేవీలు ఉంటాయన్నారు. సండూర్ పవర్‌లో సీఎం జగన్‌లా తాము మోసాలు చేయలేదని విమర్శించారు. తాను రాజీనామా సిద్ధమని, నిరూపించలేకపోతే ఏం చేస్తారని ముఖ్యమంత్రి జగన్‌ను నిలదీశారు.

*చిత్రం...ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు