ఆంధ్రప్రదేశ్‌

వాటాలివిగో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి : హెరిటేజ్ ఫ్రెష్‌తో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కుటుంబానికి భాగస్వా మ్యం ఉందనటానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి స్పష్టం చేశారు. మం గళవారం సభలో హెరిటేజ్‌పై వచ్చిన విమర్శలకు చంద్రబాబు ఘాటుగా స్పందించారు. దీనిపై
స్పందించిన మంత్రి బుగ్గన హెరిటేజ్ సంస్థ ఎవరిదని చిన్న పిల్లవాడిని అడిగినా చంద్రబాబుదని చెప్తారన్నారు. జాతీయ స్థాయిలో ‘బిజినెస్ స్టాండర్డ్’ పత్రికలో చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌కు ఫ్యూచర్ సంస్థ చెల్లించిన వాటాపై ప్రచురించారని ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలని ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ అదేమీ తెరవెనుక రహస్యం కాదని చెప్తూ కంప్యూటర్ సిస్టంలో ఏ ఒక్కరు హెరిటేజ్ వివరాలు తెలుసుకోవాలన్నా నిక్షిప్తమై ఉంటుందన్నారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరం వరకు లావాదేవీలు ఉంటాయని ఇందులో తప్పేముందని ఎదురు ప్రశ్నించారు.
*చిత్రం...ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి