ఆంధ్రప్రదేశ్‌

వంశీకి అవకాశం ఎలా ఇస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 10: శాసనసభ సమావేశాల్లో రెండో రోజైన మంగళవారం ప్రారంభంలోనే కొంత సేపు రభస నెలకొంది. పార్టీని వీడిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ప్రశ్నోత్తరాల కంటే ముందుగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నిరసనగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ సభ్యులంతా వాకౌట్ చేశారు. అంతకు ముందు దాదాపు అర గంట సేపు అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. ఓ దశలో విపక్ష సభ్యులు స్పీకర్ తమ్మినేని సీతారాంపై విరుచుపడ్డారు. అయితే ఆ తర్వాత ఆయన శాంతంగా సమాధానమిచ్చారు. సభ ప్రారంభం కాగానే వంశీలేచి ఒక సారి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరగా స్పీకర్ అనుమతిచ్చారు. వంశీ మాట్లాడటం ప్రారంభించడంతోనే ప్రతిపక్ష నేత చంద్రబాబుతోపాటు పార్టీ సభ్యులు లేచి నిలబడి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడటానికి వీల్లేదన్నారు. దీనిపై వంశీ మరింత ఆవేశంతో తనకు మాట్లాడే హక్కు ఎందుకు లేదని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తన నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం కలిసినంత మాత్రాన సస్పెండ్ చేస్తారా అంటూ నిలదీశారు.
ఇళ్ల పట్టాలు, పోలవరం కుడి కాలువ ఇతరాత్రా సమస్యలపై తాను అనేక మార్లు జగన్‌ను కలిసానని అన్నారు. మానవదృక్పథంతో సీఎం సానుకూలంగా స్పందించాలని అన్నారు. అయినా చంద్రబాబు తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసారన్నారు. పేదల కోసం ఇంగ్లీష్ మీడియంను తాను స్వాగతిస్తున్నాని, దివంగత వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సంక్షేమ పథకాల వల్ల ఎంతో మంది జీవితాలు బాగుపడ్డాయని అన్నారు. పప్పు బ్యాచ్ తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందనే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. వంశీ ప్రసంగించే సమయంలో టీడీపీ సభ్యులు అడ్డుకోవటంపై స్పీకర్ సీతారామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా మాట్లాడే హక్కు వంశీకి ఉందన్నారు. అడ్డుకునే హక్కు సభ్యులకు లేదన్నారు. ప్రశ్నోత్తరాలకు ముందుగా ఎలా మాట్లాడనిచ్చారని చంద్రబాబు ప్రశ్నించగా స్పీకర్ బదులిస్తూ 369 ఆర్టీకల్ ప్రకారం తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఏ సభ్యుడినైనా మాట్లాడనిచ్చే హక్కు అధికారం తనకు ఉందన్నారు. అనంతరం వంశీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రశంసించారు. అసలు తనను సస్పెండ్ చేస్తున్నట్లు తనకు ఎలాంటి లేఖ రాలేదంటునే అసలు టీడీపీలో కొనసాగాలన్న ఆసక్తి లేదని, తనకు ప్రత్యేకంగా ఓ సీటు కేటాయించాలని స్పీకర్‌ను కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చొవచ్చన్నారు. ఈ క్రమంలో పలువురు మంత్రులు, అధికారపక్ష ఎమ్మెల్యేలు వంశీకి అనుకూలంగా మాట్లాడటంతో ఒక్కసారిగా వంశీకి ప్రత్యేక గుర్తింపు వచ్చినట్లైంది. అసెంబ్లీని వైకాపా సభ్యులు పార్టీ కార్యాలయంగా మార్చారంటూ టీడీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై స్పీకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ పదాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకునే వంశీకి మాట్లాడే అవకాశం ఇచ్చానన్నారు. గతంలో ఎన్టీఆర్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, ఆ పాపంలో తానూ భాగస్వామినేనని అందుకు భగవంతుడు తనను 15 ఏళ్లపాటు అధికారానికి దూరంగా ఉంచారని అన్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ తీరుపై వంశీ పలు విమర్శలు చేయగా నవ్వులు వెల్లివిరిసాయి. వంశీ ప్రసంగం పూర్తయిన తర్వాతే టీడీపీ సభ్యులు తిరిగి సభ లోపలికి ప్రవేశించారు.