ఆంధ్రప్రదేశ్‌

సభ అభిప్రాయం తీసుకోకుండా ఎలా పెంచుతారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 11: ఎన్నికలకు ముందు ప్రజలపై ఎటువంటి భారాన్ని మోపబోమని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పి, ఆర్టీసీ ఛార్జీలను పెంచి సామాన్యులపై అదనపు ఆర్థిక భారాన్ని మోపారని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీల నిర్ణయాన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం అసెంబ్లీ అగ్నిమాపక కేంద్రం వద్ద నిరసన తెలిపారు. మంగళగిరి నుంచి పలువురు లోకేష్ సహా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆర్టీసీ బస్సుల్లో సచివాలయం బస్టాప్ వరకు బస్సులో ప్రయాణించారు. నల్ల బ్యాడ్జీలతో బస్టాప్ నుంచి అసెంబ్లీ ప్రాంగణం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ రోజుకో సమస్యను ప్రజలపై మోపుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ జరిగే సమయంలో సభ అభిప్రాయం తీసుకోకుండా ఆర్టీసీ ఛార్జీలను ఎలా పెంచుతారంటూ నిలదీశారు. ఇది గర్వంతో కొవ్వెక్కి తీసుకున్న నిర్ణయం తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. కాగా ప్లకార్డులతో అసెంబ్లీ ప్రాంగణం లోపలికి వెళ్లే సమయంలో మార్షల్స్‌కు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. అనంతరం అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద ప్రతిపక్ష నేత చంద్రబాబుతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బైఠాయించి ఆందోళన నిర్వహించారు.
లోకేష్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పినట్లయింది. సచివాలయం బస్టాప్ వరకు పల్లెవెలుగు బస్సులో వచ్చిన లోకేష్, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి తదితరులు ప్రదర్శనగా అసెంబ్లీ ప్రాంగణంవైపు వస్తున్న సమయంలో డ్రోన్ కెమెరా విద్యుత్ వైర్లకు తగిలి లోకేష్‌కు అతి సమీపంలో పడింది. ఆపరేటింగ్ సమస్య కారణంగానే డ్రోన్ కెమెరా కిందపడినట్లుగా తెలుస్తోంది. ఒక్క అడుగు ముందు పడినా డ్రోన్ కెమెరా లోకేష్ మీద పడిఉండేది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు.
*చిత్రం...శాసనసభ అగ్నిమాపక కేంద్రం వద్ద నిరసన తెలియజేస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ, తదితరులు