ఆంధ్రప్రదేశ్‌

2430 జీవోపై రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 12: పత్రికలు, టీవీ ప్రసారాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన 2430 జీవో శాసనసభలో గురువారం ప్రకంపనలు సృష్టించింది. వాదోపవాదాలు...విమర్శలు... ప్రతి విమర్శలతో సభ దద్దరిల్లింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇంగ్లీషును సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటం వల్లనే, ఆ జీవోలోని అంశాలను పూర్తిగా ఆకళింపు చేసుకోలేకనే అసలు ఆ జీవోను రద్దు చేయాలంటున్నారని మండిపడ్డారు. అసలు ఆ జీవోలో ఏమి దోషం ఉందో చెప్పే పరిస్థితి లేదన్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే ఆ వ్యక్తికి కనీసం ఇంగిత జ్ఞానం లేదని చెప్పడానికి ఇంతకంటే వేరే నిదర్శనం లేదన్నారు. అసలు ఆ జీవోను అర్థం చేసుకోవటంలో అవగాహన లోపం ఉంటే తప్ప ఎవరికీ తప్పుగా కన్పించదని అన్నారు. ఎక్కడైనా... ఎవరైనా అన్యాయంగా దురుద్దేశపూర్వకంగా తప్పుడు, నిరాధార, పరువుకు భంగం కల్గించే విధంగా వార్తలు ప్రచురిస్తే... అలాంటి సందర్భాల్లో సంబంధిత శాఖలకు చెందిన కార్యదర్శులకు దీనిపై ఖండనలు ఇచ్చే అధికారం... అలాగే ఫిర్యాదులు చేసే అధికారం... చివరగా అవసరమైతే న్యాయ ప్రక్రియను అనుసరించి కేసులు వేసే అధికారం ఉంటుందన్నారు. దీనిలో తప్పు ఏముందని ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ జగన్ ఎక్కడ చదివాడో చెబితే అక్కడికెళ్లి నేర్చుకుంటానంటూనే, సీఎం స్థాయిలోనున్న వ్యిక్తి తనకు ఇంగ్లీషు అర్థం కాలేదనటం సరికాదన్నారు. తాను ఎంఏ చదివానన్నారు. ఈ జీవోను తెలుగు పత్రికలతోపాటు ఇంగ్లీషు పత్రికలన్నీ వ్యతిరేకిస్తున్నాయంటే వారికీ ఇంగ్లీషు అర్థం కాలేదంటారా అని ప్రశ్నించారు. ఏదో ఒక పత్రికపై కక్ష సాధింపుతోనే ఈ జీవోను తెచ్చి మీడియాను తన గుప్పెట్లో పెట్టుకోదలచారని ఆవేశంతో అన్నారు. గతంలో దివంగత వైఎస్ ఇదే తరహాలో 938 జీవో తెచ్చి మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో భయపడి తనకు తెలియకుండా ఆ జీవోను తీసుకువచ్చారంటూ.. ఆ జీవోను పక్కన బెట్టిన విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కల్పించుకుంటూ గత ప్రభుత్వ హయాంలో అమరావతి భూములు, పోలవరం పనుల్లో నిధులు స్వాహా తదితర వార్తా కథనాలు ప్రచురించిన సాక్షి దినపత్రికపైనే కేసులు దాఖలు చేయాలంటూ ఐదు దఫాలుగా ఐఏఎస్ అధికారులు కాటంనేని భాస్కర్, చెరుకూరి శ్రీ్ధర్, అహ్మద్ బాబులకు అధికారం ఇస్తూ జారీ చేసిన జీవోల కాపీలను చ దివి వినిపించారు. బాబు చేసిన నిర్వాకంపై సింగపూర్‌లోని ఒక కంపెనీ వార్తలు ప్రచురితం చేసినందుకుగాను అక్కడి ప్రభుత్వం సైతం అక్కడి పత్రికలపై ఆంక్షలు విధించిందన్నారు.