ఆంధ్రప్రదేశ్‌

అవినీతి అధికారిని వెనకేసుకొస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 14: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఆర్‌ఎస్ అధికారిని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వెనకేసుకురావడం విచారకరమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. అవినీతి ఆరోపణల వలనే ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని, ఈ తరహా సంఘటనలు రాష్ట్రప్రభుత్వాలకు, అధికారులకు కొత్తేమీ కాదన్నారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇదేదో చాలా పెద్ద సమస్యగానూ, జాతీయ సమస్యగా చూస్తూ ప్రజలను పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారన్నారు.
ఎవరైనా తప్పు చేశారని తెలిసినప్పుడు సస్పెండ్ చేయకుండా సన్మానాలు చేస్తారా అంటూ ఎద్దేవా చేశారు. ఐఆర్‌ఎస్ అధికారి కృష్ణకిషోర్ గతంలో జగన్ కేసులు విచారించిన బృందంలో ఉన్నారు కాబట్టి ఆయనపై కక్షసాధింపు చర్యగా సస్పెండ్ చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిని బట్టి చూస్తే చంద్రబాబుతో ఆనాటి నుంచి కృష్ణకిషోర్‌కు సంబంధాలు ఉండి ఉండవచ్చన్న అనుమానం కలుగుతోందన్నారు. అందుకే కృష్ణకిషోర్‌ను చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి డెప్యుటేషన్‌పై తెచ్చుకున్నారని ఆరోపించారు. కేవలం కృష్ణకిషోర్ మాత్రమే కాదని, జేడీ లక్ష్మీనారాయణ, వెంకయ్య చౌదరిని చంద్రబాబు తన కనుసన్నల్లో పనిచేసేలా చేసుకున్నారు కాబట్టే ఆనాడు జగన్‌ను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారని ఆరోపించారు. జగన్‌పై కేసులు పెట్టి, సీబీఐ విచారణలు చేయించి గందరగోళం సృష్టించి అణచివేయాలని ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు నేడు ఈ మాటలు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వళ్లించినట్లుగా ఉందని అంబటి పేర్కొన్నారు.