ఆంధ్రప్రదేశ్‌

నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే రాజధానిపై నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 15: రాజధాని నిర్మాణానికి సంబందించి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాజధానిపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. తనకు తానుగా సీనియర్ అంటూ చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో తొమ్మిదేళ్లు, 2014 నుంచి మరో అయిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రానికి చేసింది శూన్యమని ఆరోపించారు. బాబు పాలనలో ఏపీలో అభివృద్ధి అంటూ జరిగిందేమీ లేదన్నారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉందనే చంద్రబాబు లాంటి వ్యక్తి రాష్ట్రంలో ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. నవరత్నాల సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతోమేలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌పై అనునిత్యం ఆరోపణలు చేస్తున్నారన్నారు. నవరత్నాలు అమలు కాకుండా కోర్టులకు వెళ్లి అడ్డంకులు సృష్టించడమే టీడీపీ పనిగా పెట్టుకుందన్నారు. అభివృద్ధికి టీడీపీ అడ్డంకిగా మారిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్నికలపై సీఎం జగన్ త్వరలోనే ప్రకటన చేస్తారన్నారు.
సీఎం జగన్ పాలనపై బాబుది దుష్ప్రచారం
విజయవాడ (సిటీ): చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతీసారి తీసుకున్న నిర్ణయాలు, ఆయన తీరు కారణంగానే రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. ఎప్పుడూ ప్రతికూల ధోరణితో ఉండే చంద్రబాబు ఏపీలో జన్మించడం దురదృష్టకరమని ఆదివారం ఆయన ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు సీఎం జగన్ విశ్వప్రయత్నాలు చేస్తుంటే చంద్రబాబు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆయనకున్న 40ఏళ్ల రాజకీయ అనుభవం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడూ వినియోగించ లేదన్నారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళుతుండటాన్ని చూసి చంద్రబాబు మనసు కష్టపెట్టుకుంటున్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
అంతఃపుర రహస్యాలు అందరికీ తెలిసినవే!
జనసేన మాజీ నేత రాజా రవితేజ చెప్పిన అంతఃపుర రహస్యాలు అందరికీ తెలిసినవేనని మరో ట్వీట్‌లో విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇతరుల సహాయంతోనే పవన్ తన ప్రసంగాలు చేస్తుంటారన్నారు. దత్తపుత్రుడు పవనిజం గ్రంథాన్ని రాశాడంటే ఎవరూ నమ్మలేదన్నారు. ఘోస్ట్ రైటర్ రాస్తే పేరుపెట్టుకోవడం సినిమా వాళ్లకు తెలిసిన విద్యే అంటూ ఎద్దేవా చేశారు. స్పీచ్‌లు, సోషల్ మీడియా కామెంట్లన్నీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరో రాస్తున్న సంగతి తెలియనిదేమీ కాదంటూ ఆయన ట్వీట్ చేశారు.
*చిత్రం...వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి