ఆంధ్రప్రదేశ్‌

అంబేద్కర్‌పై చర్చ జరగకుండా వైకాపా అడ్డుకుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా గత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు ప్రభుత్వం పట్టుబడితే వైఎస్‌ఆర్‌సిపి అడ్డుపడిందని తెలుగుదేశం పార్టీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకోవడంతో పాటు అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, 15 ఎకరాల్లో స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారని గుర్తు చేశారు. వీటిపై చర్చించాలనుకున్న సమయంలో కాల్‌మనీ పేరుతో ప్రతిపక్షం గొడవ చేసి అడ్డుపడిందని గుర్తు చేశారు. శుక్రవారం నాడిక్కడ ఎన్టీఆర్ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళిత మంత్రులను, ఎమ్మెల్యేలను దూషించిన ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం సబబేనని అన్నారు. ప్రివిలేజ్ కమిటీ పిలిస్తే రానా అని ఇప్పుడు అంటున్న రోజా, నాలుగుసార్లు కమిటీ పిలిచినప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సభే సుప్రీం, సభ ముందు అంతా సమానమేనని కోర్టులు సైతం చెప్పడంతో ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో రోజా ఉందని అన్నారు. ఏడాది పాటు సస్పెండ్ చేస్తే గానీ సభ నియమాలు, నిబంధనలు గుర్తుకు రాలేదా అని రోజాను ప్రశ్నించారు.