తెలంగాణ

జ్ఞానంతో పాటు శారీరక దారుఢ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: విద్యార్థులు జ్ఞానంతో పాటు శారీరక దారుఢ్యంపైనా దృష్టి పెట్టాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ఇంగ్లీషు ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులకు ఉద్దేశించిన జిమ్‌ను గవర్నర్ గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విద్యాత్మక అంశా ల్లో ప్రగతిని సాధించేందుకు శారీరకదారు ఢ్యం ఎంతో దోహదం చేస్తుందని అన్నారు. మానసిక ప్రశాంతతకు, ఒత్తిడిని ఎదుర్కొనేందుకు శారీరక కసరత్తు మంచిదని అన్నారు. నిరంతరం కసరత్తు అలవాటు కావాలని సూ చించారు. యూనివర్సిటీ జిమ్ ఏర్పాటుచేసి విద్యార్థులకు ఎంతో మేలు చేసిందని, అన్ని రకాల సౌకర్యాలనూ కల్పించిందని చెప్పారు. ఈ సదుపాయాన్ని విద్యార్థులు అంతా వినియోగించుకోవాలని చెప్పారు. కేంద్ర ప్రభు త్వం ఫిట్ ఇండియా పథకానికి అనుసంథానం చేసి దీనిని మరింత విస్తృతం చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఈ సురేష్‌కుమార్ మాట్లాడుతూ విదేశీ విద్యార్థులకు, రాయబార కార్యాలయ సిబ్బందికి ఆంగ్లభాషా ప్రావీణ్యం కో సం ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్టు చెప్పారు. 48 దేశాల నుండి 66 మంది అంతర్జాతీయ విద్యార్థులు యూనివర్సిటీలో ఉన్నారని అంతర్జాతీయ విద్యార్థులకు ప్రత్యేక కోర్సులను ఆఫర్ చేస్తున్నామని తెలిపారు. యూనివర్సిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరిట కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిందని వీసీ పేర్కొన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లైన్‌లోనే దీనిని నిర్వహిస్తున్నామని తెలిపారు.

'చిత్రం... ఇంగ్లీషు ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల జిమ్‌ను ప్రారంభిస్తున్న గవర్నర్ తమిళిసై