ఆంధ్రప్రదేశ్‌

ఊరంతా సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, జనవరి 14: సంక్రాంతి పండుగ తెలుగు ప్రజ ల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలోని కే కనె్వన్షన్ ఆవరణలో ‘ఎన్టీఆర్ టూ వైఎస్సా ర్ చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగు డు పోటీల్లో భాగంగా మంగళవారం సాయంత్రం జూనియర్స్ విభాగం పోటీలను ఆయన ప్రా రంభించారు. ఈసందర్భంగా ఎడ్ల బండలాగుడు ప్రదర్శన సమయంలో వాటిని కొరడాతో కొడుతున్న దృశ్యాన్ని చూసి చలించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెంటనే వారిస్తూ, ఎడ్లను హింసించవద్దని మందలించారు. తెలుగు వారందరికీ సంక్రాంతి పండుగ ఎంతో ముఖ్యమైందంటూ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఎడ్ల బండలాగుడు ప్రదర్శనలో పాల్గొన్న ఎడ్ల యజమానులకు, ప్రత్యేకంగా కానూరుకు చెందిన దేవభక్తుని చక్రవర్తిని ముఖ్యమంత్రి ప్రత్యేకం గా అభినందించారు. రాష్ట్ర రవా ణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య
(నాని) మాట్లాడుతూ సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటారని, ఈసందర్భంగా నిర్వహించే ఎడ్ల, పొట్టేళ్ల పోటీలు కనువిందు చేశాయన్నారు. దివంగత ఎన్టీఆర్ పుట్టిన గడ్డ గుడివాడ అని, ఈ ప్రాంతమంటే జగన్మోహనరెడ్డికి ప్రత్యేక అభిమానమని చెప్పారు. సీఎం జగన్‌ను చూసేందుకు పెద్దసంఖ్యలో మహిళలు తరలివచ్చారు. అమ్మఒడి పథకాన్ని అమలు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపే ప్లకార్డులు ప్రదర్శించారు. ముఖ్యంగా యువత కేరింతలు కొడుతూ, జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. వారి ఉత్సాహానికి తగ్గట్టుగా సీఎం జగన్ చేతులూపుతూ అభివాదం చేశారు. అనంతరం ఎడ్ల పోటీలను తిలకించారు. దివంగత ఎన్టీఆర్ మహానాడు సమయంలో పుంగనూరు ఎడ్లపై ఎక్కి సభావేదిక దగ్గరకు వచ్చినట్టుగా జగన్ దగ్గరకు కూడా పుంగనూరు ఎడ్లు, బండిని మంత్రి కొడాలి నాని తీసుకెళ్లారు. చాలా చిన్నగా ఉండే చిత్తూరు జిల్లాకు చెందిన పుంగనూరు ఎడ్లను సీఎం జగన్ ఆసక్తిగా చూశారు. అనంతరం మంత్రి కొడాలి నాని సీఎం జగన్‌కు నాగలిని బహుకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కొక్కిలిగడ్డ రక్షణనిధి, వల్లభనేని వంశీ, దూలం నాగేశ్వరరావు, కైలా అనిల్‌కుమార్, సింహాద్రి సత్యనారాయణ, అధికార భాషా సంఘం చైర్మన్ పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్-2 మోహన్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి, వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ పాల్గొన్నారు.

'చిత్రం... చిన్నారులకు భోగి పళ్లు పోస్తున్న ముఖ్యమంత్రి జగన్