ఆంధ్రప్రదేశ్‌

20న కేబినెట్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: విశాఖకు రాజధాని తరలింపు లాంఛనప్రాయం కా నుంది. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికలపై ఇప్పటికే ప్రభు త్వం సానుకూలంగా స్పందించింది. ఇక మంత్రులతో ఏర్పడిన హైపవర్ కమిటీ కూడా దాదాపు అవే ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించాలని నిర్ణయించింది. దీంతో తరలింపు ప్రక్రియలో జాప్యం జరిగితే మొదటికే మోసం వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కేబినెట్‌లో ముందుగా ఆమోదం తెలిపి ఆపై ఈ అంశం శాసనసభలో ప్రవేశపెట్టాలనే యోచనలో ఉంది. ఇందులో భాగం గా ఈ నెల 20న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఆరోజు ఉదయం 9గంటలకు జరిగే భేటీలో రాజధాని తరలింపు, రిపబ్లిక్ డే వేడుకలపై చర్చించి స్పష్టత ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధానికి సంబంధించిన అంశాలపై జీఎన్ రావు, బీసీజీ సిఫార్సులను అధ్యయనం చేస్తున్న హైపవర్ కమిటీ ఈ నెల 17న తుది విడత సమావేశమై మరికొన్ని ప్రతిపాదనలు ముందుకు తెస్తోంది. మూడు రాజధానులతో పాటు అమరావతి రైతులకు వెసులుబాటు కల్పించేలా ప్యాకేజీ పెంపుదల, ఉద్యోగుల వసతి సదుపాయాలపై తగిన హామీ ఇస్తే ఇక తరలింపులో ఎలాంటి వివాదాలు ఉండవని భావిస్తున్నారు. మరోవైపు న్యాయనిపుణులతో కూడా ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. నెలాఖరులోగా పూర్తిస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేసి వచ్చే నెల మొదటి వారం నుంచి తరలింపు ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
విశాఖలో రిపబ్లిక్ వేడుకలు?
ఇదిలావుండగా రాజధాని రైతుల ఆందోళన నేపథ్యంలో రిపబ్లిక్ దినోత్సవ వేడుకలను విశాఖలోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై కూడా మంత్రి మండలిలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. హైపవర్ కమిటీ ప్రతిపాదనలో ఉన్న సీఆర్డీఏ చట్టం రద్దు, రాజధాని వికేంద్రీకరణ, మూడు జోనల్ మండళ్ల ఏర్పాటుకు సంబంధించిన బిల్లులు కూ డా మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన అనంతరం శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. శాసనసభలో ఆమో దం పొంది శాసనమండలిలో వీగిపోతే ఆర్డినెన్స్ ద్వారా మూడు రాజధానుల ప్రతిపాదనను నెగ్గించుకునే దిశగా ప్రభు త్వం కసరత్తు జరుపుతున్నట్లు సమాచారం.