ఆంధ్రప్రదేశ్‌

మండలిలో ఆ బిల్లులు గట్టెక్కేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో కీలకమైన రెండు బిల్లులు ఏవిధంగా గట్టెక్కుతాయనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శాసనమండలిలో తిరస్కరణకు గురైతే ఆర్డినెన్సు ద్వారా వాటిని అమల్లోకి తీసుకొచ్చే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాజధాని విశాఖకు తరలింపు, హైపవర్ కమిటీ నివేదిక, తదితర అంశాలపై చర్చించేందుకు వీలుగా ఈ నెల 20నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మూడురోజులు నిర్వహించేందుకు ప్రతిపాదిస్తున్న ఈ సమావేశాల్లో ఏపీసీఆర్‌డీఏ చట్టం రద్దు, అధికార వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి చట్టానికి సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో వైకాపా సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అక్కడ బిల్లులు ఆమోదం పొందుతాయి. కానీ శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల కీలకమైన ఈ రెండు బిల్లులను తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత అసెంబ్లీ సమావేశాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం తరగతులు ప్రారంభించేందుకు ఉద్దేశించిన బిల్లుపై శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ చర్చలో కొన్ని సవరణలను పీడీఎఫ్ సభ్యులు ప్రతిపాదించారు. ఇందుకు టీడీపీ సభ్యులు కూడా మద్దతు పలకడంతో మండలిలో ఓటింగ్ జరిగింది. ఓటింగ్‌లో ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఎక్కువ ఓట్లు రావడంతో ఆ బిల్లు తిరస్కరణకు గురైంది. అదే పరిస్థితి ఈ రెండు కీలక బిల్లుల విషయంలో పునరావృతం అయ్యే అవకాశం ఉంది. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ నాలుగు వారాలుగా రాజధాని ప్రాంత రైతులు, టీడీపీ
నేతలు ఆందోళనలు చేయడం తెలిసిందే. ఈనేపథ్యంలో శాసనమండలిలో ఈ రెండు బిల్లులు ఆమోదం పొందడం కష్టమే. అయితే ప్రభుత్వం కూడా దీన్ని ముందుగానే గమనించి ఆర్డినెన్సులను జారీ చేసే అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.