ఆంధ్రప్రదేశ్‌

‘స్థానిక’ సమరం తరువాతే బియ్యం కార్డులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: త్వరలో రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల తరువాతే పౌర సరఫరాల శాఖ అధికారులు లబ్ధిదారులకు బియ్యం కార్డులు జారీ చేయనున్నారు. అనర్హత పేరుతో బియ్యం కార్డుల సంఖ్య తగ్గిస్తే దాని ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం ఉందని భావిస్తుండటంతో కార్డుల జారీలో మరికొంత జాప్యం అనివార్యం కానుంది. వైఎస్సార్ నవశకం కింద ప్రతి పథకానికి వేర్వేరు కార్డులను జారీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే తెల్లకార్డు ఉన్న 1.47కోట్ల మంది సహా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి బియ్యం కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. గత ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి అర్హుల జాబితా రెడీ చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రకటించేందుకు రంగం సిద్ధం చేశారు. బియ్యం కార్డుల ముద్రణకు 20కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం కేటాయించింది. ముద్రణకు టెండర్లను ఆహ్వానించారు. జనవరి 1నుంచి బియ్యం కార్డుల ఆధారంగా రేషన్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ తరుణంలో స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించి హైకోర్టు అనుమతి ఇవ్వడంతో బియ్యం కార్డుల జారీపై అధికారులు పునరాలోచనలో పడ్డారు. ఈ నెల 17 నుంచి ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియ, ఫిబ్రవరి 8 నుంచి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానున్నాయి. తెల్ల రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ పథకానికి ఉన్న లింక్‌ను ఇప్పటికే తొలగించడం వల్ల తెల్ల కార్డు లేనప్పటికీ ఆరోగ్యశ్రీ కార్డు పొందే వీలు కలిగింది. ఇప్పటికే జారీ చేసిన తెల్ల రేషన్ కార్డుల్లో చాలామంది అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని జిల్లాల్లో దాదాపు 20శాతం వరకూ అనర్హులు తెల్ల కార్డులను పొందినట్లు తేలింది. దీంతో బియ్యం కార్డులను జారీ చేసేముందు వడబోతకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.
విద్యుత్ వాడకం, తదితర అంశాల ఆధారంగా తెల్లకార్డు పొందిన అనర్హులపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో బియ్యం కార్డుల అర్హుల సంఖ్య గతంలోకన్నా తక్కువ కానుంది. ఎన్నికల ముందు కార్డుల సంఖ్యను కుదించడం వల్ల దాని ప్రభావం ఫలితాలపై ఉండే అవకాశం ఉండటంతో స్థానిక సంస్థల ఎన్నికల తరువాతే జారీ చేయాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు. వార్డు, గ్రామ సచివాలయాల్లో బియ్యం కార్డుల అర్హుల జాబితా ప్రకటనను నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చాకే ప్రచురించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. బియ్యం కార్డులు జారీ చేసే వరకూ పాత కార్డులపై రేషన్ సరకుల పంపిణీకి చర్యలు తీసుకోనున్నారు.