ఆంధ్రప్రదేశ్‌

1 3 జిల్లాల అభివృద్ధే సీఎం లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్తుకూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 13 జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించేలా సీఎం పాలన సాగిస్తున్నారని విజయసాయిరెడ్డి ప్రశంసించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని తన స్వగ్రామమైన తాళ్లపుడి పంచాయతీలో 13 కోట్ల రూపాయల సీసీఆర్ నిధులతో పలు అభివృద్ధి పనులకు సంబంధించి గురువారం ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం
జరిగిన బహిరంగ సభలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వికేంద్రీకరణతోనే రాష్ట్భ్రావృద్ధి సాధ్యమవుతుందన్నారు. 13 జిల్లాల్లో వికేంద్రీకరణ దిశగా అడుగులు వేసి తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2 లక్షల 58 వేల కోట్ల రూపాయల మేర రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసి వెళ్లారని విమర్శించారు. రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ జగన్మోహన్‌రెడ్డి 13 జిల్లాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తుంటే చంద్రబాబు బురదజల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు అమరావతిని కాపాడుకోవడంపై ప్రేమ లేదని, అక్కడ చౌకగా భూములు కొనేవారు ఉండబోరని ఆలోచించి కొందరిని రెచ్చగొట్టి ధర్నాలు నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన సాగిస్తున్నారని తెలిపారు. 2024 ఎన్నికలలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పల్లెపాడు గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. తమ గ్రామాలు కూడా అభివృద్ధి చేయడానికి నిధులు కావాలని విజయసాయిరెడ్డిని అడిగిన వెంటనే రెండు కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. విజయసాయిరెడ్డి నెలలో ఒక్కసారి అయినా ఈ గ్రామంలో బస చేయాలని గ్రామస్తుల తరఫున వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరటంతో తప్పకుండా ఈ గ్రామంలోనే ఒక రోజంతా ఉంటానని బదులివ్వడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం జలవనరుల శాఖ మంత్రి పి అనిల్‌కుమార్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వైకాపాకు కంచుకోటలాంటిదని విజయసాయిరెడ్డి వీఆర్ కళాశాలకు వౌలిక సదుపాయల కోసం కోటి రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఒక్కప్పుడు వీఆర్ కళాశాలలో విద్యను అభ్యసించినట్లు సభాముఖంగా గుర్తు చేశారు. ఇది పేదల ప్రభుత్వం అని, ప్రతిఒక్కరికి అండదండగా ఉంటుందని ఆయన తెలిపారు.

'చిత్రం...తన స్వగ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి