ఆంధ్రప్రదేశ్‌

మెనూ మారింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 18: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతా ప్రమాణాలతో అందించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. పథకం అమలుపై శనివారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. భోజనం మెనూలో మార్పులు జరగాలన్నారు. పులివెందుల నుంచి అమరావతి వరకు ఎక్కడ తిన్నా రుచికరంగా ఉండాలని స్పష్టం చేశారు. ఆయాలకు ఇచ్చే గౌరవ వేతనం రూ. 3వేలతో సహా సరకులకు నగదు చెల్లింపులు గ్రీన్ ఛానెల్‌లో నిర్వహించాలని సూచించారు. భోజనం తనిఖీకి నాలుగంచెల విధానాన్ని అవలంబించాలన్నారు. నాణ్యతా ప్రమాణాల పరిశీలనకు పాఠశాల స్థాయిలో తల్లిదండ్రుల కమిటీని ఏర్పాటు చేయాలని అందులో ముగ్గురు
తల్లులను నియమించాలని ఆదేశించారు. పేరెంట్స్ కమిటీ విద్యార్థులతో సహపంక్తి భోజనం చేసి నాణ్యతను పరిశీలించాలన్నారు. ఈ కమిటీలే నాడు- నేడు పారిశుద్ధ్య పనులను కూడా పర్యవేక్షించాలని నిర్దేశించారు. రెండో దశలో గ్రామ సచివాలయాల ద్వారా, మూడో దశలో స్వయం సహాయక బృందాలు, నాలుగో స్థాయిలో సెర్ప్ లేదా మరో ఇతర సంస్థ ద్వారా తనిఖీలు నిర్వహించాలని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో ఆర్డీఓలు పర్యవేక్షిస్తారని చెప్పారు. ఆహారంలో నాణ్యత, ప్రమాణాలు ఉండాలని ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి రూ. 13 వందల కోట్లు ఖర్చు చేస్తోందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం కోసం ప్రత్యేకించి ఓ యాప్‌ను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఈ యాప్ పనిచేస్తుందని చెప్పారు. ఇది ప్రస్తుతం మెనూ పరిశీలన కోసం వినియోగిస్తామని వివరించారు. తరువాత ఆహార నాణ్యత, తనిఖీ కోసం ఉపయోగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 21 నుంచి నాణ్యతతో మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డివిజన్ స్థాయిలో కోడిగుడ్లు సరఫరా టెండర్లను పిలవాలని సూచించారు. ఇందులో కూడా రివర్స్ టెండరింగ్‌కు వెళ్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇందులో పౌల్ట్రీ ఫారం యజమానులు ఉండేలా నిబంధనలు సడలించాలని ముఖ్యమంత్రి సూచించారు. నేరుగా పౌల్ట్రీ యజమానులే టెండరింగ్‌లో పాల్గొంటే ధర తగ్గే అవకాశం ఉందన్నారు. వేరుసెనగ, బెల్లం చిక్కీల సరఫరాకు సంబంధించి స్వయం సహాయక సంఘాల సహకారంతో అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందులోనూ నాణ్యత పాటించాలని సీఎం స్పష్టం చేశారు. వేరుసెనగ, బెల్లం చిక్కీల తయారీలో తగిన శిక్షణ ఇస్తామని అధికారులు తెలిపారు. విద్యాశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమ్మఒడి కార్యక్రమం అమలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఆ తరువాత ఇంగ్లీష్‌లో బోధన, నాడు-నేడు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పిల్లలను బడికి పంపితే మేలు జరుగుతుందనే భరోసా కల్పించిన కార్యక్రమం అమ్మ ఒడి అన్నారు. ఆంగ్ల మాధ్యమంపై సెల్ఫ్ ఎసైన్‌మెంట్ యాప్‌కు రూపకల్పన చేస్తున్నట్లు అధికారులు వివరించారు. వారం రోజుల్లో దీనికి తుది రూపు వస్తుందన్నారు. ఈనెల 21న మిడ్‌డే మీల్‌తో పాటు పాఠశాలల్లో పారిశుద్ధ్యంపై కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా కమిటీలకు బాధ్యత అప్పగించాలన్నారు. ఇప్పటి వరకు అమ్మఒడి పథకం కింద 42,32,098 మంది లబ్ధిదారులు ఎంపిక కాగా 40,19,223 మందికి రూ. 15వేల చొప్పున మొత్తం రూ. 6028.98 కోట్లు జమ చేసినట్లు వివరించారు. ఇంకా 2,12,775 మంది పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. నాడు- నేడు కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇందు కోసం రివాల్వింగ్ ఫండ్‌ను తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో పెయింటింగ్ డిజైన్లపై సీఎం ఆరా తీశారు. ఇందుకోసం మూడు డిజైన్లు సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ కింద ఫర్నీచర్, పెయింట్స్, ఫాన్లు, శానిటరీ సామాగ్రి కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. డిజైన్లను మూడు రోజుల్లో ఖరారు చేయాలన్నారు. సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
'చిత్రం... ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి