ఆంధ్రప్రదేశ్‌

డైనమిక్ సీఎం వైఎస్ జగన్: తెలంగాణ మంత్రి తలసాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జనవరి 16: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులు ఇబ్బందులు పడక్కర్లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ భరోసా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో డైనమిక్ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఉన్నారని గుర్తుచేశారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌తో కలిసి ఆయన గురువారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు మాటలు నమ్మవద్దని ఆందోళనకు దిగిన అమరావతి రైతులను కోరారు. బాబును నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని ఈదినట్లే ఉంటుందని వ్యాఖ్యానించారు. రాజధాని అన్నది ఈ రాష్ట్రానికి చెందిన అంశమని, అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. విభజన హామీలన్నీ అమలుకు ప్రయత్నాలు చేస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులున్నా యువ ముఖ్యమంత్రి జగన్ ధైర్యంగా ప్రజాహిత కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. అమ్మఒడి వంటి సంక్షేమ కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్నాయని మంత్రి తలసాని సీఎం జగన్‌ని ప్రశంసించారు.