ఆంధ్రప్రదేశ్‌

వారు చేసేది బినామీల పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట: రాజధాని అమరావతిపై ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని రాష్ట్ర మంత్రులు మోపిదేవి వెంకటరమణ, మేకతోటి సుచరిత, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ధ్వజమెత్తారు. బినామీల ఆస్తుల కోసమే బాబు పోరాటం అని మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణపై శనివారం గుంటూరు జిల్లా నరసరావుపేటలోని స్టేషన్‌రోడ్డులో జరిగిన బహిరంగ సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సభకు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సభలో మంత్రి సుచరిత మాట్లాడుతూ గత 31రోజులుగా రాజధాని కోసం ఉద్యమం చేస్తున్నామంటూ చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా
విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం రాజధాని రైతులకు ఇచ్చిన హామీల్లో ఎక్కువ భాగం అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అహర్నిశలు పనిచేస్తున్నారని అన్నారు. రాజధాని రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలకు జగన్మోహన్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని అన్నారు. మార్కెటింగ్ శాఖామంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ అధికార వికేంద్రీకరణ కోసం మూడు ప్రాంతాలను రాజధానిగా ఎంపిక చేయడం పరిపాలనా పరంగా సరైన నిర్ణయం అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేందాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులు రాజధాని ఆందోళనలో పాల్గొనడం చూస్తుంటే అమరావతి పేరుతో జరుగుతున్న ఉద్యమం వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే అనిపిస్తోందన్నారు. అమరావతి ఎక్కడికీ వెళ్లదని, శాసన రాజధానిగా ఉంటుందన్నారు. కర్నూలులో న్యాయరాజధాని, విశాఖలో పాలనా రాజధాని, ఇలా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబునాయుడు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం రాజధాని ప్రాంతంలోని 29గ్రామాల్లోని కొన్ని గ్రామాల్లో మాత్రమే ఉద్యమం పేరుతో ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఈ సభలో ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, విడదల రజని, ఉండవల్లి శ్రీదేవి, బొల్లా బ్రహ్మనాయుడు, అంబటి రాంబాబు, నంబూరి శంకరరావు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్, మక్కెన మల్లికార్జునరావు, పార్టీ నేతలు, తదితరులు మాట్లాడారు. పాల్గొన్నారు. తొలుత గుంటూరు రోడ్డులోని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గృహం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు వికేంద్రీకరణకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు.

'చిత్రం... సభలో మాట్లాడుతున్న మంత్రులు సుచరిత, మోపిదేవి