ఆంధ్రప్రదేశ్‌

కారణజన్ముడు ఎన్టీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 11: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కారణ జన్ముడని, తెలుగువారి కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిచెప్పిన ఎన్‌టిఆర్ సేవలు ఎనలేనివని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు శ్లాఘించారు. మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఎన్‌టిఆర్ 24వ వర్ధంతి సందర్భంగా శనివారం ఆ మహానేత నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ కార్యకర్తలు రక్తదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సినీరంగంలోనూ, రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసుకుని ప్రజలకు సేవచేసే విషయంలో రాజీపడని రాజకీయ ఉద్దండుడు నందమూరి అని కొనియాడారు. మహిళలకు ఆస్తిలో సమాన వాటా, రెండు రూపాయలకే కిలోబియ్యం, పేదలకు పక్కా గృహాలు ఇలా అన్నివర్గాల వారికి తన పాలనా హయాంలో అండగా నిలిచారన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్, పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, పార్టీ నేతలు టిడి జనార్ధన్, కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు.

'చిత్రం...ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న చంద్రబాబు