ఆంధ్రప్రదేశ్‌

‘రాజధాని’లో తప్పులను ఉపేక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, జనవరి 18: రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తప్పు చేస్తే సహించేది లేదని పీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ హెచ్చరించారు. శనివారం ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గతంలో జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అమరావతిలో ఉండేందుకు అంగీకారం తెలిపారని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన శ్రీ కృష్ట కమిటీ, శివరామకృష్ట కమిటీ నివేదిక మేరకు రాజధాని ఏర్పాటు చేయాలని కోరామన్నారు. ఒక్కొక్క పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడుల్లా రాజధాని మార్చడం మంచి పద్ధతి కాదన్నారు. రాజధాని విషయంలో ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాజధానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అందుకే రాజధానిని విశాఖపట్టణానికి తరలిస్తున్నానని చెప్పడం సరికాదన్నారు. ప్రభుత్వం 28వేల కోట్ల రూపాయలు రాజధానికి చాలని చెప్పిన ముఖ్యమంత్రి మాత్రం లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వేసిన జిఎన్‌రావు కమిటీ రిపోర్ట్‌ను 4 రోజుల ముందే జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పడమే పలు విమర్శలకు తావిస్తోందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, దుగరాజుపట్నం, ఇండస్ట్రీయల్ కారిడర్, మెట్రోకారిడర్‌ను రాబట్టడంలో ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఢిల్లీలో మాత్రం ఎన్‌ఆర్‌సి బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి ఇక్కడ మాత్రం తాము ముస్లింల మనోభావాలకు దెబ్బతీసే ఏ బిల్లుకు అయిన తాను వ్యతిరేకమని చెపుతున్నారని జగన్‌పై ధ్వజమెత్తారు. బిజెపి ప్రభుత్వం చేపడుతున్న జాతీయ గణనను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. లౌకిక వాదంకు అనుకూలంగా ఉండే భారతదేశాన్ని బిజెపి లాంటి సెక్యూలర్ పార్టీ వచ్చి దేశాన్ని మత కలహాలలతో కొట్టుకునే విధంగా చేస్తుందన్నారు. దేశానికి సుస్థిర పాలన అందించే పార్టీ ఒక్క కాంగ్రెస్ ఒక్కటేనన్నారు.