ఆంధ్రప్రదేశ్‌

ఏం జరగబోతోంది?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 19: రాజధాని తరలింపు వ్యవహారంపై మంత్రివర్గ సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో ఏమి జరగబోతోందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పిలుపునివ్వటం, కొన్ని పక్షాలు ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులపై ప్రభుత్వం గోప్యత పాటిస్తుండగా, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ, శాసనమండలిలో బిల్లులను గట్టెక్కించడంపై ముఖ్యమంత్రి సమాలోచనలు జరపడం వంటి ఘటనలు ఆదివారం జరిగాయి. రాజధాని తరలింపుపై జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ నివేదికలు ఇవ్వడం తెలిసిందే. ఈ రెండు నివేదికలను అధ్యయనం చేసి తగిన సిఫారసులు చేసేందుకు ప్రభు త్వం నియమించిన హైపవర్ కమిటీ కూడా పలుమార్లు భేటీ అయి రాజధాని తరలింపు, వికేంద్రీకరణపై మొగ్గుచూపడం తెలిసిందే. హైపవర్ కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సోమవారం అందజేయనుంది.
* నేడు మంత్రివర్గ భేటీ
మూడు రాజధానులు, అధికార, పరిపాలనా వికేంద్రీకరణ, తదితర అంశాలపై హైపవర్ కమిటీ తన నివేదికను సోమవారం ప్రభుత్వానికి అందజేయనుంది. వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం ఉదయం 9గంటలకు జరిగే మంత్రివర్గ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదికపై చర్చించనున్నారు. అసెంబ్లీలో ఏయే బిల్లులు ప్రవేశపెట్టాలనే అంశం పైనా చర్చించనున్నారు. ఉదయం 9గంటలకు మంత్రివర్గ సమావేశం, 10గంటలకు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్వహించి, 11గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించనున్నారు. 21న శాసనమండలి సమావేశం కానుంది. మంత్రివర్గ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదికపై చర్చతో పాటు మూడు రాజధానులు, ఏపీ సీఆర్‌డీఏ రద్దు, వికేంద్రీకరణ, రైతుల సమస్యలను చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.
* బిల్లులపై సర్కారు గోప్యత
అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం గోప్యత పాటిస్తోంది. మూడు రాజధానుల ప్రతిపాదన, సీఆర్‌డీఏ చట్టం రద్దు, ఇంగ్లీషు మీడియం తరగతులు, తదితర బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. రాజధాని తరలింపు అంటూ కాకుండా అధికార, పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా సీఆర్‌డీఏ రద్దు బిల్లును ద్రవ్యబిల్లుగా ప్రవేశపెట్టే అంశం కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. బిల్లులను ఏవిధంగా ప్రవేశపెడతారనే విషయం బయటకు పొక్కకుండా అధికారులు, ప్రభుత్వం గోప్యత పాటిస్తోంది. ఏరోజున ఈ బిల్లులు ప్రవేశపెడతారనే అంశంపై కూడా స్పష్టత ఇవ్వడం లేదు.
* మండలిలో గట్టెక్కడంపై చర్చ
అసెంబ్లీలో బిల్లులు ఆమోదం పొందాక శాసనమండలిలో ఏవిధంగా గట్టెక్కించాలన్న అంశంపై మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మండలిలో వైకాపా పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తదితరులతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మంతనాలు సాగించారు. మండలిలో వైకాపాకు బలం తక్కువగా ఉండటంతో అక్కడ ఇబ్బందులు ఎదురైతే ఏవిధంగా గట్టేక్కించాలన్న అంశంపై సమాలోచనలు జరిపారు. ఈ బిల్లులను శాసనమండలిలో టీడీపీ తప్పకుండా అడ్డుకోనుంది. ఆనక సెలక్ట్ కమిటీకి పంపితే ఏమి చేయాలన్న అంశంపై ముఖ్యమంత్రి చర్చించడం గమనార్హం.
* అసెంబ్లీలో అడ్డుకునేందుకు టీడీపీ వ్యూహం
అసెంబ్లీలో రాజధాని తరలింపు బిల్లును ప్రవేశపెట్టకుండా అన్ని రకాలుగా అడ్డుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి టీడీపీ పదును పెడుతోంది. అసెంబ్లీ, శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు టీడీఎల్పీ సమావేశంలో చర్చించారు. న్యాయనిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నారు. అసెంబ్లీ వేదికగా తమ వాదనలు వినిపించటంపై దృష్టి సారించారు. శాసనమండలిలో బిల్లులను ఏ రూపంలో ప్రవేశపెట్టినా సెలక్ట్ కమిటీకి పంపేలా చూడాలన్న వ్యూహాన్ని టీడీపీ అనుసరించనుంది. అసెంబ్లీలో అధికార పక్షాన్ని కట్టడి చేసి, బయట అసెంబ్లీ ముట్టడి ద్వారా రాజధాని తరలింపు నిర్ణయంపై ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా చేయాలని టీడీపీ భావిస్తోంది.
* భారీ భద్రత
రాజధాని రైతుల ఆందోళనలు, వివిధ పక్షాలు చలో అసెంబ్లీ, అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 5వేల మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి అసెంబ్లీకి సీఎం కాన్వాయ్‌తో ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించారు. అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలు, రైతుల ఆందోళనలు, ముట్టడి పిలుపు నేపథ్యంలో అసెంబ్లీలో, మంత్రివర్గంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

'చిత్రం... ఏపీ శాసనసభ
*(ఇన్‌సెట్‌లో) పోలీసుల బందోబస్తు