ఆంధ్రప్రదేశ్‌

భారత్ హిందూ దేశం.. కాపా డుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 19:భారతదేశం హిందూ దేశమని, హిందువులే ఈ దేశాన్ని కాపాడుకోవాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) జాతీయ సంయుక్త కార్యదర్శి కోటేశ్వర శర్మ పిలుపునిచ్చారు. నగరంలో రెండు రోజులుగా జరుగుతున్న ఉత్తరాంధ్ర ప్రాంత వీహెచ్‌పీ సమావేశాల ముగింపు ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్య్రానికి ముందు అఖండ భారతావనిని మత ప్రాతిపదికన హిందూ, ముస్లిం రాజ్యాలుగా విభజించారన్నారు. అయితే సెక్యులరిజం పేరిట రాజకీయ నాయకులు స్వార్ధపూరితంగా వ్యవహరించడం వల్ల పాకిస్తాన్‌లో మైనారిటీ వర్గాలైన హిందువులు తీవ్ర అణచివేతకు, ఊచకోతకు గురయ్యారన్నారు. లక్షలాది మంది హిందువులు శరణార్థులుగా భారత్‌కు తిరిగి వచ్చారన్నారు. హిందువులు ఇంతలా వివక్షకు గురవుతున్నా పాలకులు స్పందించ లేదన్నారు. ఇరు దేశాల్లో మైనారిటీ వర్గాలకు రక్షణ, పౌరసత్వ హక్కులు కల్పించాలని అప్పటి ఇరు దేశాల ప్రధానమంత్రులు(పండిట్ నెహ్రూ, లియాఖత్ ఆలీ) మధ్య ఒప్పందం జరిగినప్పటికీ అమలు చేయలేదన్నారు. పాకిస్తాన్‌లో మైనార్టీ హిందువులను క్రూరంగా హతమారుస్తున్నా అప్పటి పాలకులు స్పందించ లేదన్నారు. ఇక విశ్వవిద్యాలయాలను రాజకీయ వేదికలుగా మార్చారని మండిపడ్డారు. ఢిల్లీలోని జేఎన్‌యూ విద్యాలయాన్ని వామపక్షాలకు ధారాదత్తం చేశారని, ఇప్పుడు దేశద్రోహులు, సంఘ విద్రోహక శక్తులకు నిలయంగా మారిందని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అనవసర రాద్ధాంతం చేస్తూ అలజడులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. భారతీయ విద్యాకేంద్రం పూర్వ అధ్యాపకుడు సత్యారావు మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రెండూ హిందూ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తూ వ్యవస్థను భ్రష్ఠుపట్టిస్తున్నాయని ఆరోపించారు. ఈ తరుణంలో హైందవ సమాజ ప్రభావాన్ని కరపత్రాలు, పుస్తకాల ద్వారా ఇంటింటికీ చేరవేస్తూ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాల్లోనూ ఒకే రోజున ఎమ్మార్వో కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించడంతోపాటు మున్సిపల్ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించాలని, కలెక్టర్ల ద్వారా రాష్టప్రతికి విజ్ఞాపనలు పంపాలని సూచించారు. వీహెచ్‌పీ ప్రాంత అధ్యక్షుడు వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రం తీసుకుంటున్న చర్యలను ప్రతి హిందువు బలపరచాలన్నారు. రెండు రోజుల సదస్సులో ప్రాంత సహ కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్, గాంగేయుల సుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి అప్పలరాజు, శర్మ, రత్నాజీరావు పాల్గొన్నారు.
'చిత్రం... మాట్లాడుతున్న వీహెచ్‌పీ జాతీయ సంయుక్త కార్యదర్శి కోటేశ్వర శర్మ